T20 World Cup 2022- Team India: టీ20 వరల్డ్ కప్ శనివారం ఆరంభం కానుంది. దీనికి ఆస్టేలియా వేదిక అవుతోంది. ఆస్ట్రేలియాతో పాటు ఇండియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు బరిలో నిలిచాయి. దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ జట్లు డార్క్ హార్స్ గా మారనున్నాయి. వరల్డ్ కప్ లో సూపర్ 12 దశ మొదలు కానుంది. శుక్రవారంతో గ్రూప్ దశకు ఎండ్ కార్డు పడుతుంది. ఇక జట్లలో పోటీ తీవ్రంగా కానుంది. అన్ని జట్లు కప్ గెలవాలని ఆశిస్తున్నా ఫేవరేట్ గా బరిలో దిగిన జట్లలోనే ప్రధాన పోటీ నెలకొంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆతిథ్య ఆస్ట్రేలియా కప్ కైవసం చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక టైటిల్ ఫేవరేట్ గా ఆస్ట్రేలియా బరిలో దిగుతోంది. ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా ఫేవరేట్ గానే ఉండనున్నాయి. ఈనేపథ్యంలో శ్రీలంక కూడా అండర్ డార్క్ గా నిలవనుంది. టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవాలని అన్ని జట్లు భావిస్తున్నాయి. ఆస్ట్రేలియా జట్టు చివరి క్షణంలో ఓ మార్పు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ జాష్ ఇంగ్లిస్ ను టీ 20 ప్రపంచ కప్ నుంచి తప్పించి అతడి స్థానంలో గ్రీన్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఇతడు చాలా ప్రమాదకరమన ఆటగాడు కావడంతో అన్ని జట్లు ఆందోళన చెందుతున్నాయి.
ముమ్మాటికి కప్ సొంతం చేసుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది. దీనికి గాను ఆటగాళ్లను సిద్ధం చేసింది. జట్టులో అందరు ఆల్ రౌండర్లే ఉండటంతో దాన్ని ఎదుర్కోవడం కష్టమే అనే భావనలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా జట్టు సమరానికి సై అనేలా రెడీ అవుతోంది. పోటీ జట్లు ఆస్ట్రేలియా స్క్వాడ్ చూస్తేనే జడుసుకునేలా ఉంది. జట్టులో ఆల్ రౌండర్లకు కొదవ లేదు. ఈ నేపథ్యంలో దూకుడుగా ఆడే ఆటగాళ్లను ఆస్ట్రేలియా పోటీకి దించుతోంది. ఆస్త్రేలియా జట్లును మట్టికరిపించడం అంత సులభం కాదనే వాదనలు కూడా వస్తున్నాయి.

వీరంతా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో సమర్థులు కావడంతో వారిని ఎదుర్కోవడం అన్ని జట్లకు సవాలే. ఈ క్రమంలో మిచెల్ మార్క్, గ్లెయిన్ మ్యాక్స్ వెల్, స్టాయినిస్, టిమ్ డేవిడ్, గ్రీన్ లాంటి ఆల్ రౌండర్లు ఆస్ట్రేలియాకు అందుబాటులో ఉండటంతో బౌలింగ్, బ్యాటింగులో బలంగా ఉంది. వీరంతా సమర్థంగా పరుగులు చేయనుండటంతో వీరిని కట్టడి చేయడం అంత సులువు కాదని చెబుతున్నారు. అత్యంత భారీ షాట్లు ఆడే క్రికెటర్లు ఉండటంతో ఆస్ట్రేలియాను కంట్రోల్ చేసే సామర్థ్యం ఏ జట్టుకు ఉంటుందో వేచి చూడాల్సిందే.
టీమిండియాలో ఆల్ రౌండర్లు తక్కువే. ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే మన ఆటగాళ్లలో సామర్థ్యం తక్కువే. దీంతో ఆస్ట్రేలియాను ఎదుర్కోవడంలో మన జట్టు నిలుస్తుందా? తడబడుతుందా అనేది సందేహమే. టీ20 వరల్డ్ కప్ లో విజయంపై అన్ని జట్లు కన్నేసినా చివరకు ఏ జట్టు నిలుస్తుందో తెలియడం లేదు.