Homeఎంటర్టైన్మెంట్Koratala Siva: ఒకపుడు తన స్టోరీలను బోయపాటి శ్రీను కాపీ కొట్టాడని కొరటాల శివ బాధపడ్డాడు......

Koratala Siva: ఒకపుడు తన స్టోరీలను బోయపాటి శ్రీను కాపీ కొట్టాడని కొరటాల శివ బాధపడ్డాడు… ఇప్పుడు ఆ తప్పు తనే ఎందుకు చేశాడు ?

ప్రస్తుతం కొరటాల శివ చేసిన సినిమాలు కాపీ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. శ్రీమంతుడు సినిమా కాపీ కొట్టారనే టాక్ రాగానే ఈయన తీసిన మిగిలిన సినిమాల్లో కూడా కొన్ని సినిమాలు కాపీ చేసినవే అంటూ వార్తలు వస్తున్నాయి.

Koratala Siva: టాలీవుడ్ లో బోయపాటి శ్రీను, కొరటాల శివ ఇద్దరు కూడా టాప్ డైరెక్టర్లే.. వినయ విధేయ రామ లాంటి సినిమా వదిలేస్తే అటు బోయపాటి ఇటు కొరటాల కెరీర్ లో అన్ని సూపర్ హిట్ సినిమాలే ఉన్నాయి. కొరటాల శివ చేసిన సినిమాలు అన్ని కూడా బంపర్ హిట్లే అందుకున్నాయి. ఇక బోయపాటి శ్రీను కూడా భద్ర సినిమాతో మొదలు పెడితే అఖండ సినిమా వరకు అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. ఒక్క బాలయ్య బాబుకే ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లను అందించారు బోయపాటి.

అయితే ప్రస్తుతం కొరటాల శివ చేసిన సినిమాలు కాపీ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. శ్రీమంతుడు సినిమా కాపీ కొట్టారనే టాక్ రాగానే ఈయన తీసిన మిగిలిన సినిమాల్లో కూడా కొన్ని సినిమాలు కాపీ చేసినవే అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో బోయపాటి శ్రీను తన కథను కాపీ కొట్టారని తెలిపిన శివ ప్రస్తుతం తాను ఎందుకు ఇలాంటి పని చేశారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సింహ సినిమాకు కథ, మాటలు రాసింది కొరటాల శివ అని టాక్. ఈయన రాసిన కథ, మాటలకు తన పేరు వేయలేదని గతంలో ప్రచారం జరిగింది.

ఈ విషయంపై కొరటాల శివ బోయపాటిని కూడా ప్రశ్నించారట. అయితే కథ, మాటలకు దేనికైనా ఒక దానికి మాత్రమే పేరు వేస్తామని బోయపాటి చెప్పారని, దానికి చాలా బాధ అనిపించి రెండింటికి వద్దన్నారట. కానీ ప్రస్తుతం కొరటాల శివ అదే పని చేశారని.. ఒకప్పుడు తనకు అలాంటి బాధ ఎదురైతే.. మరి ప్రస్తుతం ఈ డైరెక్టర్ చేసిన పనేంటి అని కొందరు విమర్శిస్తున్నారు. అయితే తాజాగా కొరటాల శివ మీద ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా కథను డైరెక్టర్ కొరటాల శివ కాపీ కొట్టారని.. అది తను రాసిన కథ అంటున్నారు రచయిత శరత్ చంద్ర. దీనికి సంబంధించిన ఆధారాలను రచయితల సంఘానికి కూడా అందించారు. అంతే కాదు తమ నివేదికను నాంపల్లి కోర్టుకు కూడా పంపించారు. దీన్ని పూర్తిగా విచారించిన కోర్టు స్వాతి లో వచ్చిన కథల ఆధారంగానే శ్రీమంతుడు సినిమా తీశారని నిర్ధారణకు వచ్చింది. అయితే ఈ డైరెక్టర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా అతనికి షాక్ తగిలింది. ఈ కేసులో తాము విచారణ జరపడానికి ఏం లేదని.. పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని తెలిపింది. దీంతో లాయర్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు కొరటాల శివ.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper