Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Andhra Pradesh » Chiranjeevi is likely to get rajya sabha seat from up

Chiranjeevi: యూపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి.. బిజెపి ఆఫర్

ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఉమ్మడి ఏపీలో 18 ఎమ్మెల్యే సీట్లను సాధించారు. తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్రమంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర విభజన తరువాత సైలెంట్ అయ్యారు.

Written By:Dharma Raj, Updated On : February 1, 2024 / 03:27 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Chiranjeevi Is Likely To Get Rajya Sabha Seat From Up

Chiranjeevi

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వనున్నారా? యూపీ నుంచి ఆయనకు బెర్త్ ఖాయమైందా? నేరుగా కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో బలమైన చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. రాజకీయాల వైపు ఇక వెళ్ళనని కూడా చిరంజీవి తేల్చేశారు. అయితే చిరంజీవి కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఉమ్మడి ఏపీలో 18 ఎమ్మెల్యే సీట్లను సాధించారు. తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్రమంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర విభజన తరువాత సైలెంట్ అయ్యారు. రాజ్యసభ పదవీకాలం పూర్తి కావడంతో రాజకీయాలకు దూరమయ్యారు. సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశానని బాధపడ్డారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇకనుంచి సినిమా రంగంలో మాత్రమే కొనసాగుతానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ చిరంజీవి కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తూనే ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల అటువంటి ప్రయత్నాలు పెరిగినట్లు తెలుస్తోంది.

మొన్నటికి మొన్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు చిరంజీవికి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. కుటుంబ సమేతంగా ఆయన అయోధ్యకు వెళ్లారు. అటు తరువాత దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్ కు చిరంజీవిని ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఐదుగురు ప్రముఖులను ఎంపిక చేయగా అందులో చిరంజీవి ఒకరు కావడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చిరంజీవి పేరు మరోసారి బయటకు వచ్చింది. ఆయనను యూపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేస్తారన్న ప్రచారం బలంగా జరుగుతోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించాలని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఏపీ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 2029 నాటికి స్వతంత్రంగా ఎదగాలని భావిస్తోంది. అందులో భాగంగా బలమైన సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని తిప్పుకోగలిగితే ఏపీలో బిజెపి బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఆ దిశగా బిజెపి ప్రయత్నాలు మొదలు పెట్టింది. చిరంజీవికి రాజ్యసభ పదవితో పాటు కేంద్ర క్యాబినెట్లో సైతం చోటు కల్పించనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే సోదరుడు పవన్ రాజకీయాల్లో ఉన్నారు. ఒకసారి రాజకీయ అరంగేట్రం చేసి తప్పు చేశానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో బిజెపి ప్రయత్నాలను ఆయన ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి. గతంలో చిరంజీవిపై ప్రచారం జరిగినప్పుడు ఆయనే స్వయంగా స్పందించారు. ఆ ప్రచారాన్ని ఖండించారు. ఇప్పుడు కూడా ఖండిస్తారో? లేకుంటే ఈ ప్రచారం నిజమని చెబుతారో? అన్నది చూడాలి.

Dharma Raj

Dharma Raj Author - OkTelugu

Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Read More

Web Title: Chiranjeevi is likely to get rajya sabha seat from up

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Chiranjeevi
  • Megastar Chiranjeevi
  • Rajya Sabha Seat
  • Up
Follow OkTelugu on WhatsApp

Related News

Rimi Sen: ఊహించని విధంగా మారిపోయిన చిరంజీవి హీరోయిన్.. ప్రస్తుతం ఏం చేస్తుందంటే..

Rimi Sen: ఊహించని విధంగా మారిపోయిన చిరంజీవి హీరోయిన్.. ప్రస్తుతం ఏం చేస్తుందంటే..

Nayanthara: నయనతార మారిపోయింది, చిరంజీవి కోసమేనా?

Nayanthara: నయనతార మారిపోయింది, చిరంజీవి కోసమేనా?

Chiranjeevi and Anil Ravipudi : చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టిన నయనతార..వీడియో వైరల్!

Chiranjeevi and Anil Ravipudi : చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టిన నయనతార..వీడియో వైరల్!

Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు ట్రైలర్ కట్ పవన్ కళ్యాణ్ కి నచ్చలేదా..?

Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు ట్రైలర్ కట్ పవన్ కళ్యాణ్ కి నచ్చలేదా..?

Chiranjeevi and Balayya : నాగార్జున ఇండస్ట్రీ హిట్ కొట్టకుండా అడ్డుకున్న  చిరంజీవి,బాలయ్య…ఏం జరిగిందంటే..?

Chiranjeevi and Balayya : నాగార్జున ఇండస్ట్రీ హిట్ కొట్టకుండా అడ్డుకున్న చిరంజీవి,బాలయ్య…ఏం జరిగిందంటే..?

Chiranjeevi-Anil Ravipudi : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

Chiranjeevi-Anil Ravipudi : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

Chiranjeevi and Nayanthara : చిరంజీవి కోసం 20 ఏళ్ళ ప్రామిస్ ని పక్కన పెట్టిన నయనతార..!

Chiranjeevi and Nayanthara : చిరంజీవి కోసం 20 ఏళ్ళ ప్రామిస్ ని పక్కన పెట్టిన నయనతార..!

Jagadeka Veerudu Atiloka Sundari  “: వర్కింగ్ డేస్ లో కూడా కుమ్మేస్తున్న ‘జగదేక వీరుడు’ రీ రిలీజ్..5 రోజుల్లో వచ్చింది ఎంతంటే!

Jagadeka Veerudu Atiloka Sundari  “: వర్కింగ్ డేస్ లో కూడా కుమ్మేస్తున్న ‘జగదేక వీరుడు’ రీ రిలీజ్..5 రోజుల్లో వచ్చింది ఎంతంటే!

Star Heroes : హిట్ అవ్వాల్సిన మన స్టార్ హీరోల సినిమాలు మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఏంటంటే..?

Star Heroes : హిట్ అవ్వాల్సిన మన స్టార్ హీరోల సినిమాలు మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఏంటంటే..?

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.