Kingdom Movie Vijay Confidences: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ దక్కనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ లాంటి నటుడు సైతం ఆయన చేసిన సినిమాలతో అతనికి గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టినప్పటికి గత కొద్దిరోజుల నుంచి ఆయన వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. మరి ఎట్టకేలకు కింగ్డమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక విజయ్ దేవరకొండ గత కొద్ది రోజుల నుంచి ఒక భారీ సక్సెస్ కోసం ఆరాటపడుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన కింగ్డమ్ సినిమాతో మంచి సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని తద్వారా తమ హీరో టైర్ వన్ హీరోగా మారాలని తన అభిమానులు దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు. బ్రదర్స్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ దేవరకొండకు చాలా కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: కింగ్డమ్ ఎన్ని కోట్లు వసూలు చేస్తే విజయ్ టైర్ వన్ హీరోగా మారుతాడో తెలుసా..?
ఇప్పటివరకు ఆయన ఇలాంటి జానర్ లో సినిమా అయితే చేయలేదు. కాబట్టి ఇది తనకొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి తన అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తి ఎదురు చూస్తున్న క్రమంలో విజయ్ ఇందులో డిఫరెంట్ గెటప్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు.
డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు… ఇక ఈ మూవీ ఫస్ట్ కాపీ చూసిన వెంటనే విజయ్ దేవరకొండ ఆనందంతో అన్నం తిన్ననూరు ని హగ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: అప్పుడు బాలయ్యకు ఇప్పుడు పవన్ కి… సేమ్ సీన్ రిపీట్!
ఈ సినిమా అవుట్ పుట్ అద్భుతంగా రావడం వల్లే ఆయన కింగ్డమ్ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తోంది… మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక గొప్ప ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…