Govt teacher spelling mistake viral video : సర్కారు చదువులు అంటేనే ఒక అప నమ్మకం.. ప్రజలు ఇచ్చే పన్నులతో జీతాలు తీసుకుంటున్న టీచర్లు.. మొక్కుబడిగా చదువులు చెబుతున్నారు. దీంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడం మానేస్తున్నారు. తాము చెప్పు చదువుపై నమ్మకం ఉంటే.. ఉపాధ్యాయులు తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలకే పంపించేవారు. కానీ వారు లక్షలు పోసి ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు పంపుతున్నారు. ఇలా వేల రూపాయలు జీతంగా తీసుకుంటూ.. విధులు సక్రమంగా చేయని ఉపాధ్యాయులపై చర్య తీసుకునేందుకు ఏ ప్రభుత్వం సాహసం చేయడం లేదు. ఇక ఆర్టికల్ 311 వారికి అపరిమిత రక్షణ కల్పిస్తుంది. ఇక ఆశ్చర్యం ఏమిటంటే చదువు రాని వారు కూడా ఉపాధ్యాయులుగా ప్రభుత్వ కొలువులు సాధించి.. చదువు చెప్పే ప్రయత్నం చేయడమే.. చత్తీస్‌గఢ్‌లో ఓ ఉపాధ్యాయుడికి స్పెల్లింగ్ చదవడం కూడా రావడం లేదు. దీంతో తప్పుడు చదువులతో విద్యార్థులనూ తప్పుదోవ పట్టిస్తున్నారు.
వెరీ బ్రిలియంట్ టీచర్
రూ.70 వేలు జీతం తీసుకుంటూ ELEVEN స్పెల్లింగ్ రాయలేకపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడుఅధికారులు తనిఖీల్లో స్పెల్లింగ్ రాయమని అడిగితే తప్పుగా రాసిన ఉపాధ్యాయుడు
ఛత్తీస్‌గఢ్ – బలరాంపూర్ స్కూల్లో ఘటన pic.twitter.com/leWCDr0SGM
— Vijaya Reddy (@VijayaReddy_R) July 29, 2025
రూ.70 వేల జీతం తీసుకుంటూ..
ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఆశ్చర్యకర ఘటన విద్యా వ్యవస్థలోని నాణ్యతపై తీవ్ర చర్చకు దారితీసింది. రూ.70 వేలు జీతం తీసుకుంటున్న ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడు, అధికారుల తనిఖీ సందర్భంగా ‘ELEVEN’, “NINETEEN’ వంటి ప్రాథమిక ఆంగ్ల పదాల స్పెల్లింగ్‌ను తప్పుగా రాశాడు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత, ఉపాధ్యాయుల నియామక ప్రక్రియపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. బలరాంపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన తనిఖీ సందర్భంగా, ఆంగ్ల ఉపాధ్యాయుడు సురేంద్ర దీక్షిత్‌ను అధికారులు ‘ELEVEN’, ‘NINETEEN’ పదాల స్పెల్లింగ్‌లు బోర్డుపై రాయమని కోరారు. అయితే, ఆయన ‘ELEVEN’ను ‘AIVENE’గా, ‘NINETEEN’ను ‘NINITHIN’గా రాశారు. ఐదేళ్ల బోధనా అనుభవం ఉన్న ఈ ఉపాధ్యాయుడు తాను రాసిన స్పెల్లింగ్‌లపై నమ్మకంగా ఉన్నట్లు సమాధానం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ఘటనను రికార్డ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Also Read: 7 వేలతో ఫ్లైట్ తయారీ.. ఎగిరించాడు.. ఇండియాకు దొరికిన ఆణిముత్యం
విద్యా నాణ్యత డొల్ల..
ఈ ఘటన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతపై సీరియస్‌గా ఆలోచించేలా చేసింది. రూ.70 వేల జీతం పొందుతున్న ఉపాధ్యాయుడు ప్రాథమిక స్పెల్లింగ్‌లను సరిగా రాయలేకపోవడం, ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో లోపాలను సూచిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఉపాధ్యాయుల జీతాలు 7వ వేతన సంఘం ప్రకారం రూ.36 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటాయి.అయితే అర్హతలు, శిక్షణలో లోపాలు తాజా ఘటనకు నిదర్శనం.
సంస్కరణల అవసరం
ఈ ఘటన ఉపాధ్యాయుల నియామకంలో కఠినమైన పరీక్షలు, శిక్షణ అవసరాన్ని సూచిస్తుంది. శిక్షణ కూడా మొక్కుబడిగా పొందుతున్నారు. డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించడం, వారికి నిరంతర శిక్షణ అందించడం, పనితీరును క్రమం తప్పకుండా పరిశీలించడం అవసరం. మరి లెవన్ స్పెల్లింగ్ కూడా రాని ఈ ఉపాధ్యాయుడిని అధికారులు ఇంకా కొనసాగిస్తే.. విద్యార్థులకు ద్రోహం చేసినట్లే.