Homeఎంటర్టైన్మెంట్'విజయ్'' రేంజ్ పెంచడానికి క్రేజీ హీరోయిన్ !

‘విజయ్” రేంజ్ పెంచడానికి క్రేజీ హీరోయిన్ !

అదృష్టం అంటే హీరో ‘విజయ్ దేవరకొండ’దే. అనుకోకుండా వచ్చిన క్రేజ్.. కొన్నాళ్ళు ఉండి పోతుంది అనుకున్నారు, కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం ఆ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. అయితే విచిత్రంగా ఒక్క తెలుగులోనే కాదు అటు సౌత్ మొత్తంతో పాటు బాలీవుడ్ లో కూడా విజయ్ క్రేజ్ రోజులు గడిచే కొద్దీ పెరుగుతూ ఉండటమే కొంతమంది స్టార్ హీరోలకు అర్ధం కానీ మిలియన్ల డాలర్ల క్వశ్చన్. అసలు విజయ్ కన్నా అన్నిట్లో గొప్పే.. కానీ […]

Vijay-Puri Movie
అదృష్టం అంటే హీరో ‘విజయ్ దేవరకొండ’దే. అనుకోకుండా వచ్చిన క్రేజ్.. కొన్నాళ్ళు ఉండి పోతుంది అనుకున్నారు, కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం ఆ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. అయితే విచిత్రంగా ఒక్క తెలుగులోనే కాదు అటు సౌత్ మొత్తంతో పాటు బాలీవుడ్ లో కూడా విజయ్ క్రేజ్ రోజులు గడిచే కొద్దీ పెరుగుతూ ఉండటమే కొంతమంది స్టార్ హీరోలకు అర్ధం కానీ మిలియన్ల డాలర్ల క్వశ్చన్. అసలు విజయ్ కన్నా అన్నిట్లో గొప్పే.. కానీ అతనికి వస్తోన్న పాపులారిటీ మనకు ఎందుకు రావడం లేదు అంటూ నాని, వరుణ్ తేజ్ లాంటి హీరోలు లోలోపలే ఇబ్బంది పడుతున్నారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్.

దీనికితోడు విజయ్ దేవరకొండ అంటే.. పాన్ ఇండియా స్టార్ అనే వ్యవహారం కనిపిస్తోంది. ఎందుకో తెలియదు గానీ, మొదటి నుండి విజయ్ ను బాలీవుడ్ ముద్దు చేస్తూనే వచ్చింది. అక్కడి స్టార్ హీరోయిన్లు సైతం పబ్లిక్ గా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చారంటేనే.. విజయ్ కి బాలీవుడ్ లో దక్కిన విలువ ఏమిటో అర్ధం అవుతుంది. అందుకే ఓ రేంజ్ లో.. విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ పూరితో కలిసి విజయ్ దేవరకొండను బాలీవుడ్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు.

ఎలాగూ విజయ్ – పూరి జగన్నాద్ కలయిక పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికితోడు ‘లైగర్’ అంటూ కొత్త కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నారు. అందుకే ఈ సినిమా పై బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆ క్రేజ్ ను అమాంతం పెంచడానికి ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ చేత చేయిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేయాలంటే.. కియారా లాంటి స్టార్ కావాలి. అందుకే కరుణ్ జోహార్ కియారాని సాంగ్ చేయడానికి ఒప్పించాడట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper