
‘హైపర్ ఆది..’ బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన కమెడియన్. జబర్దస్త్ షోలోకి సాధారణ కంటిస్టెంట్ గా వచ్చి.. తనదైన టాలెంట్ తో టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. అప్పటి నుంచి తనదైన పంచ్ లు పేలుస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఇప్పుడు కేవలం జబర్దస్త్ లోనే కాకుండా.. అన్ని రకాల షోస్ లోనూ కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. అయితే.. తాజాగా హైపర్ ఆదిపై దారుణమైన కామెంట్స్ చేశాడు నాగబాబు.
నాగబాబు జబర్దస్త్ షోలో ఉన్నప్పుడు ఎవరూ కూడా ఆయనపై పంచ్ లు వేసేవారు కాదు. ఆది కూడా అంతే. పంచ్ లు వేయకపోగా.. భజన ఫుల్లుగా చేసేవాడు. అయితే.. నాగబాబు ఆ షోలోంచి ‘అదిరింది’ అనే ప్రోగ్రామ్ కు జడ్జిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ షోకు జబర్దస్త్ నుంచి చాలా మందిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు నాగబాబు. కానీ.. కొందరు వచ్చారు మరికొందరు రాలేదు. రానివారిలో హైపర్ ఆది కూడా ఉన్నాడు.
రాకపోవడానికి మల్లెమాల ప్రొడక్షన్స్ తో చేసుకున్న అగ్రిమెంట్లు వగైరా కారణాలు ఉన్నాయనే ప్రచారం సాగింది. అయితే.. నాగబాబు వెళ్లిన తర్వాత ‘అదిరింది’ ప్రోగ్రామ్ పై చాలా సార్లు సెటైర్లు వేశాడు ఆది. దీంతో.. వ్యవహారం వేరే ట్రాక్ ఎక్కిందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా.. సోషల్ మీడియా వేదికగా హైపర్ ఆదిపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
సోషల్ మీడియాలోని ఫాలోవర్లతో తరచూ కాంటాక్ట్ అవుతున్నారు నాగబాబు. క్వశ్చన్ అవర్ నిర్వహిస్తూ వారికి మరింత దగ్గరవుతున్నారు. తాజాగా నిర్వహించిన చాటింగ్ లో.. ఓ నెటిజన్ హైపర్ ఆది గురించి ఏమైనా చెప్పమని అడిగాడు. దానికి.. ‘అతను ఓకే కానీ.. కామెడీలో అప్డేట్ లో కావాల్సి ఉంది’ అని చెప్పేశాడు నాగబాబు.
ఇప్పటికే.. హైపర్ ఆది రొటీన్ పంచులు, డైలాగులతో బండి నడిపిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు నాగబాబు కూడా ఇండైరెక్ట్ అదే తరహా కామెంట్ చేయడం విశేషం. దీంతో.. సింగిల్ కామెంట్ తో ఆది గాలి తీసేశాడని అంటున్నారు నెటిజన్లు.