Jr NTR Phone Number Leak: జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానులకు ఉన్న ప్రేమ గురించి ఎంత రాస్తే సరిపోతుంది. ఎన్ని చెప్తే సరితూగుతుంది. ఓ యుగపురుషుడి వారసుడిగా తారక్ నిలబడిన విధానం అద్భుతం, మహానాయకుడి మనవుడిగా తారక్ ఎదిగిన తీరు అమోహం. ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేని విజయ కథ ఎన్టీఆర్ ది. ఇక ఎన్టీఆర్ అభిమానులతో ఎప్పుడు దగ్గరగా ఉంటారు

ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ప్రాణాపాయంలో తన అభిమాని ఆరోగ్యం గురించి తెలుసుకోవానికి, జనార్ధన్ తల్లిని ఫోన్ కాల్ ద్వారా ఎన్టీఆర్ పరామర్శించి దైర్యం చెప్పారు. ఐతే, ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా రియల్ హీరో అని, ఎన్టీఆర్ వ్యక్తిత్వం ఇలా ఉంటుంది అని అభిమానులకు చెప్పాలని పీఆర్వో టీమ్ ప్రయత్నించింది.
Also Read: Prabhas Die Hard Fan: ప్రభాస్ తో ఫొటో కోసం నిరాహరదీక్ష కి దిగిన వీరాభిమాని

కానీ, ఈ ప్రయత్నం రివర్స్ అయింది. ఎన్టీఆర్ మాట్లాడిన ఫోన్ నంబర్ అందరి కంటపడింది. ఇంకేముంది ప్రేక్షకలోకం ఆ నంబర్ డయల్ చేయడం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ అనుకుని.. వేల సంఖ్యలో ఫోన్స్ రావడం మొదలు అయ్యింది. ఐతే, ఈ నంబర్ మాత్రం ఎన్టీఆర్‌ది కాదని, ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరు మీద ఉందని తెలుస్తోంది.

నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలయికలో వచ్చిన భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. స్నేహానికి ప్రాణమిచ్చే పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంది. అమాయకత్వంతో కూడిన విప్లవ వీరుడు భీమ్ పాత్రలో తారక్ ఒదిగిపోయారు. తన నటనతో ఎన్టీఆర్ అబ్బురపరిచారు.

అసలు, ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ నటనకు ముగ్ధులు కాని వారు లేరు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ నటనను అమితంగా ప్రశంసిస్తూ ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. కథను బట్టి ఎన్టీఆర్ విలక్షణమైన వాటర్ లాగా ఫీల్ అవుతూ ఉత్తమమైన నటనను కనబర్చాడు. తన అభినయంతో ప్రేక్షక హృదయాలను ఆకట్టుకున్నారు.

‘కొమురం భీముడో’ పాటలో ఎన్టీఆర్ నటనకు అభిమానులు మురిసిపోతున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ల సమయాన్ని పెట్టాడు. అందుకే ఫ్యాన్స్ తో పాటు నందమూరి ఫాలోవర్స్ కూడా ఈ సినిమాపై ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, తీరా సినిమా విడుదలైన తర్వాత చూస్తే.. ఆశించిన స్థాయిలో ఎన్టీఆర్ ట్రాక్ లేదు. ఈ విషయంలోనే చాలా మంది ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఎన్టీఆర్ నటనకు గొప్ప పేరు వస్తోంది.

Also Read:Sudigali Sudheer- Indraja: సుధీర్, ఇంద్రజకు ఉన్న రిలేషన్ ఇదేనట..: ఓపెన్ అయిన జబర్దస్త్ జడ్జి
[…] Also Read: Jr NTR Phone Number Leak: జూ.ఎన్టీఆర్ ఫోన్ నంబర్ లీక్.… […]