NTR Flop Movie Super Hit In Bangladesh: మన టాలీవుడ్ లో నేటి తరం హీరోలలో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అని అడిగితె మన అందరికి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్..నూనూగు మీసాలు కూడా రాని వయస్సు నుండే ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని మాస్ ఇమేజి ని సంపాదించి ఇండస్ట్రీ లో చక్రం తప్పుతున్నాడు..ఆయనకీ ఆ స్థాయి మాస్ ఫంమ్ ఫాలోయింగ్ రావడానికి కారణం ఆది మరియు సింహాద్రి సినిమాలే..అప్పట్లో ఎన్టీఆర్ కి రాజమౌళి మరియు VV వినాయక్ పోటీపడి మరి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చేవారు..సిమహాద్రియో వంటి సెన్సషనల్ హిట్ సినిమా చేసిన తర్వాత ఎలాంటి సినిమా తియ్యాలి అని తర్జభర్జన పడుతున్న సమయం లో అప్పటికే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ తో ఆంధ్రావాలా అనే సినిమా తీసి పెద్ద ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్..కానీ ఇదే సినిమాని కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ని హీరో గా పెట్టి మెహర్ రమేష్ తీసిన ‘వీర కన్నడిగ’ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

Also Read: Chandrababu- KCR: చంద్రబాబు చేయలేదు సరే.. మరి కేసీఆర్ ఏం చేసినట్టు?
ఇక ఈ సినిమా తర్వాత తనతో ఆది వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన వీవీ వినాయక్ తో సాంబ అనే సినిమా తీసాడు..సెన్సషనల్ హిట్ కాంబినేషన్ కావడం తో ఈ సినిమా పై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో తారా స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి..సినిమా పర్వాలేదు అనే రేంజ్లో అనిపించినప్పటికీ కమర్షియల్ గా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది..అయితే ఇదే సినిమాని కన్నడ లో ‘మాండ్య’ అనే పేరు తో రీమేక్ చేసారు..అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ గా సాధించింది..మళ్ళీ ఈ సినిమాని ‘ఏక్ రోఖా’ అనే పేరు తో బెంగాలీ భాషలో రీమేక్ చేసారు..ఈ వెర్షన్ బాంగ్లాదేశ్ లో విడుదలయ్యి సంచలన విజయం సాధించింది..దేశం కానీ దేశం లో ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమా రీమేక్ ఈ స్థాయిలో విజయం సాధించింది అనే విషయం చాలా మందికి తెలియని విషయం అని చెప్పొచ్చు..ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరియు వీవీ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన అదుర్స్ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా పడలేదు..భవిష్యత్తులో పడుతుందని కూడా నమ్మకం లేదు అనే చెప్పాలి.

Also Read: Delhi Husband Wife Case: భర్త మద్యం తాగేస్తున్న భార్య..చూసిన ఆ భర్త ఏం చేశాడో తెలుసా?
Recommended Videos
[…] Also Read: NTR Flop Movie Super Hit In Bangladesh: బాంగ్లాదేశ్ లో రీమేక్ … […]