spot_img
Homeఎంటర్టైన్మెంట్Jr NTR admired Balakrishna films: బాలయ్య బాబు సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కి నచ్చిన...

Jr NTR admired Balakrishna films: బాలయ్య బాబు సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కి నచ్చిన సినిమాలు ఇవేనా..?

Jr NTR admired Balakrishna films: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఆయన కెరియర్ స్టార్టింగ్ లో సీనియర్ ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు. సీనియర్ ఎన్టీఆర్ సైతం బాలయ్య బాబు తన నట వారసుడు అంటూ ప్రకటించడంతో అతను టాప్ రేంజ్ హీరోగా మారడమే కాకుండా అప్పటినుంచి ఇప్పటివరకు టాప్ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పుడు చేస్తున్న సినిమాలతో సైతం ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

తన చిన్నతనం నుండి బాలయ్య బాబు సినిమాలు చూస్తూ పెరగడం వల్ల మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతోనే మాస్ సినిమాలైతే చేసినట్టుగా గతంలో కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు…జూనియర్ ఎన్టీఆర్ కి, బాలయ్య బాబు చేసిన సినిమాల్లో రెండు సినిమాలంటే బాగా నచ్చుతాయట. అందులో ఒకటి ‘రౌడీ ఇన్స్పెక్టర్’ కాగ మరొకటి ‘సమర సింహారెడ్డి’ సినిమా కావడం విశేషం…

Also Read: పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న స్టార్ డైరెక్టర్…

ఈ రెండు సినిమాలు అతని మీద చాలా వరకు ఇంపాక్ట్ కలిగించాయని చాలా సంవత్సరాల పాటు ఆ సినిమాలను రిపీటెడ్ గా చూస్తూ ఉండేవాడినని గతంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు… ఇక వీటితోపాటుగా ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’ లాంటి సినిమాలను సైతం జూనియర్ ఎన్టీఆర్ కి బాగా నచ్చేవట అందుకే ఆ డీవీడీ లు తెప్పించుకొని మరి తను చూసేవాడట.

మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియాలో టాప్ హీరోగా వెలుగొందడమే కాకుండా నందమూరి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లే మూడోవ తరం హీరోగా అవతరించాడు… ఇక ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికి నందమూరి అభిమానులు మాత్రం వీళ్లిద్దరు కలిసిపోతే చూడాలని కోరుకుంటున్నారు…ఇక వీళ్ళ కాంబోలో సినిమా వస్తే ఇంకా బాగుంటుందని ఎదురుచూసే ప్రేక్షకులు కూడా ఉన్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular