Homeఎంటర్టైన్మెంట్Actress jayasudha: అయ్యో.. ఏంటి జయసుధ ఇలా మారిపోయారు?

Actress jayasudha: అయ్యో.. ఏంటి జయసుధ ఇలా మారిపోయారు?

Actress jayasudha: పద్నాలుగేళ్ల వయసులో వెండితెరపై కనిపించి.. సహజనటిగా గుర్తింపు పొందారు జయసుధ. ఇప్పటికీ టాప్​ హీరోహీరోయిన్లకు అమ్మగా నటిస్తూ.. తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అలా విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. కాగా, ఇటీవలే ఆమె పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. చివరగా మహర్షి, రూలర్​ సినిమాల తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ నటించినట్లు కనిపించలేదు.

jayasudha
Actress jayasudha

అయితే, అందుకు కారణం ఆమె ఆరోగ్యం సరిగా బాగుండటం లేదని, ఆనారోగ్యం కారణంగా చికిత్స కోసం విదేశాల్లో ఉంటున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అయితే, ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా సోషల్​మీడియాలో షేర్​ చేసిన ఫొటో హాట్​టాపిక్​గా మారింది.

Also Read: నయా ట్రెండ్ సెట్ చేసిన మలయాళ ముద్దుగుమ్మలు!

ఎప్పుడూ నిండు మొహంతో కలకలలాడుతూ కనిపించే జయసుధ.. ఈ ఫొటోలో పీక్కుపోయి కనిపించారు. చాలా డిఫరెంట్​గానూ ఉన్నాుర. ఈ క్రమంలోనే ఫోటోతో పాటు స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ అంటూ క్యాప్షన్ జోడించారు. అయితే, ఆమెను చూసిన అభిమానులు.. జయసుధ ఇలా అయిపోయిందేమిటిఅంటూ షాక్​అవుతున్నారు.

అయితే, ఆమెకు ఏమైంది. ఇలా మారడానికి గల కారణాలేంటనే విషయాలపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు జయసుధ. కాగా, ఆమె భర్త నితిన్​ కపూర్​ 2017లో మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దోడికి గతేడాది వివాహం జరిగింది.  మరి మళ్లీ జయసుధ సినిమాల్లోకి వస్తుందా.. లేక ఇలాగే మిగిలిన జీవితాన్ని ప్రయాణంలో గడిపేస్తుందా తెలియాల్సి ఉంది.

Also Read: ఈ హీరోయిన్ల రియల్ ఫేస్ లుచూస్తే కిందపడిపోతారు..!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular