‘మా’ ఎన్నికల గోల ఇప్పట్లో తీరేలా లేదు. దీనికి తోడు ఈ ఎన్నికలు కూడా రాజకీయ ఎన్నికలు లాగా రసవత్తరంగా సాగనున్నాయి. ఇప్పటికే పోటీలో ఐదుగురు ఉన్నారు. ప్రతి ఒక్క మా సభ్యుడికి ఇప్పుడు ఉన్న ఏకైక డౌట్ ఒకటే. కొత్త అధ్యక్షుడిగా గెలిచే వ్యక్తి ఎవరై ఉంటారా అంటూ అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ మొదట అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించి ముందే సిద్ధం అయ్యాడు కాబట్టి, ప్రకాష్ రాజ్ గెలుస్తాడు అంటున్నారు.
మరోపక్క మంచు విష్ణుకి బలమైన సామాజిక వర్గం నుండి గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి, గెలిచే అవకాశం విష్ణుకే ఎక్కువ ఉన్నాయని సినిమా వాళ్ళ అభిప్రాయం. ఇక జీవిత రాజశేఖర్ మరియు హేమలు కూడా పోటీ చేస్తామని ప్రకటించినా వారి పోటీకి విలువ లేదు. అలాగే నటుడు సీవీఎల్ తెలంగాణ వాదం అంటూ సరికొత్త పోటీకి ఆరాట పడుతున్నా ఇది అసలు వర్కౌట్ అయ్యేలా లేదు.
అయితే తాజాగా సినీ వర్గాల లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సహజనటి జయసుధ కూడా సొంతంగా అధ్యక్ష పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే నిజం అయితే ఫలితాల్లో చాల మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే, జయసుధ గతంలో పోటీ చేసి రాజేంద్ర ప్రసాద్ చేతిలో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుండి మళ్ళీ జయసుధ ఎన్నికల పై మాట్లాడింది లేదు.
కానీ, ప్రకాష్ రాజ్ ప్యానల్ లో జయసుద పోటీ చేయబోతుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. సొంతంగా అధ్యక్ష పోటీకి దిగబోతుందట. జయసుధను గెలిపించే ఉద్దేశ్యం ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారట. పోటీ చేస్తే ఇతర అభ్యర్థుల ఆమె నుండి గట్టి పోటీ వస్తుంది. మరి ఆమె గెలుస్తుందా లేదా అనేది చూడాలి.