Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan Movie Leak: 'జన నాయగన్' చిత్రాన్ని లీక్ చేసింది వాళ్లేనా.. ? ప్లాన్...

Jana Nayagan Movie Leak: ‘జన నాయగన్’ చిత్రాన్ని లీక్ చేసింది వాళ్లేనా.. ? ప్లాన్ చేసి మరీ చావుదెబ్బ కొట్టారుగా..

Jana Nayagan Movie Leak: సోషల్ మీడియా ని మొత్తం ఇప్పుడు విజయ్(Thalapathy Vijay) ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్రంలోని సన్నివేశాలు ఒక రేంజ్ లో షేక్ చేస్తున్నాయి. అప్పుడెప్పుడో 2013 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం ఇలాగే విడుదలకు ముందు లీక్ అయ్యింది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగవని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే HD బ్లూ రే ప్రింట్ తో ఈ చిత్రం ఆన్లైన్ లోకి […]

Jana Nayagan Movie Leak: సోషల్ మీడియా ని మొత్తం ఇప్పుడు విజయ్(Thalapathy Vijay) ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్రంలోని సన్నివేశాలు ఒక రేంజ్ లో షేక్ చేస్తున్నాయి. అప్పుడెప్పుడో 2013 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం ఇలాగే విడుదలకు ముందు లీక్ అయ్యింది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగవని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే HD బ్లూ రే ప్రింట్ తో ఈ చిత్రం ఆన్లైన్ లోకి అందుబాటులోకి రావడం నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అప్పుడంటే సోషల్ మీడియా ఈ రేంజ్ లో వృద్ధి కాలేదు కాబట్టి , పెద్దగా వ్యాప్తి చెందలేదు. డీవీడీ రూపం లో సీడీ షాప్స్ లో అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ని చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఉపయోగిస్తున్నారు.

అందుకే మూవీ మొత్తం వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. అయితే ఈ సినిమాని లీక్ చేసింది ఎవరు..? అనే అంశం పై ఇప్పుడు తమిళనాడు లో జోరుగా చర్చ సాగుతోంది. విజయ్ ఫ్యాన్స్ చెప్తున్నది ఏమిటంటే , DMK పార్టీ కి సంబంధించిన వాళ్ళే, విజయ్ మీద అక్కసు తో , ఈ చిత్రాన్ని ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ చేశారని , తమిళ నాడు రాజకీయాలు ఎవ్వరూ ఊహించని స్థాయిలో దిగజారిపోయింది అంటున్నారు. మరి కొంతమంది చెప్పేది ఏమిటంటే , ఈ సినిమాని స్వయంగా మూవీ టీం వాళ్ళే లీక్ చేసి ఉంటారని అంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ ఇప్పటికీ రాలేదు. ఇప్పుడు ఈ చిత్రం లీక్ అయ్యింది కాబట్టి, ఎట్టి పరిస్థితి లో తొందరగా విడుదల చెయ్యాలని , సెన్సార్ బోర్డు మెంబెర్స్ పై ఒత్తిడి తీసుకొచ్చే అద్భుతమైన అవకాశం ఉంటుందని , అందుకే ఇలా చేసారని అంటున్నారు.

సోషల్ మీడియా ని ఈ రేంజ్ లో జనాలు ఉపయోగిస్తున్న రోజుల్లో, నిర్మాతలు అంత తెలివి తక్కువ నిర్ణయాలను తీసుకోరని, కచ్చితంగా విజయ్ మీద పగతోనే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు చేసారని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం , ఏది అబద్దం అనేది పోలీసులు నిర్ణయించాలి. ఒకవేళ అధికార DMK పార్టీ నే ఈ పని చేసుంటే , కచ్చితంగా విజయ్ కి పొలిటికల్ గా వేరే లెవెల్ మైలేజ్ వస్తుందని , DMK పార్టీ కి చాలా గట్టి దెబ్బ పడుతుందని అంటున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుండి విజయ్ ని ఎన్ని విధాలుగా టార్గెట్ చెయ్యాలో , అధికార పార్టీ అన్ని విధాలుగా టార్గెట్ చేసిందని, ఇలాంటి నీచపు రాజకీయాలు మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పైన కూడా చూడలేదని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper