Homeఎంటర్టైన్మెంట్Vadala Box Office: ప్రింట్ ఖర్చులు కూడా రాబట్టలేకపోయిన జగపతి బాబు 'వదలా' చిత్రం..

Vadala Box Office: ప్రింట్ ఖర్చులు కూడా రాబట్టలేకపోయిన జగపతి బాబు ‘వదలా’ చిత్రం..

Vadala Box Office: హీరోగా మార్కెట్ ని పూర్తిగా కోల్పోయిన తర్వాత సీనియర్ హీరో జగపతి బాబు విలన్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వడం వల్ల , ఆయన కెరీర్ ఏ రేంజ్ లో దూసుకుపోయిందో మన కళ్లారా చూశాము . కేవలం విలన్ రోల్స్ మాత్రమే కాకుండా, అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్ చేస్తూ , నేటి తరం ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు జగపతి బాబు. అయితే చాలా కాలం తర్వాత ఆయన హీరో గా […]

Vadala Box Office: హీరోగా మార్కెట్ ని పూర్తిగా కోల్పోయిన తర్వాత సీనియర్ హీరో జగపతి బాబు విలన్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వడం వల్ల , ఆయన కెరీర్ ఏ రేంజ్ లో దూసుకుపోయిందో మన కళ్లారా చూశాము . కేవలం విలన్ రోల్స్ మాత్రమే కాకుండా, అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్ చేస్తూ , నేటి తరం ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు జగపతి బాబు. అయితే చాలా కాలం తర్వాత ఆయన హీరో గా నటించిన చిత్రం ‘వదలా’. రీసెంట్ గా ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జగపతి బాబు మాలాడుతూ , ఈ సినిమాకు బిజినెస్ జరగలేదు , అందుకే షూటింగ్ పూర్తి అయ్యాక కూడా మేము విడుదల చేయలేకపోయాము. ఇప్పుడు నిర్మాత సొంతగా విడుదల చేస్తున్నారు. మీరే ఈ సినిమాని చూసి సక్సెస్ చెయ్యాలి అంటూ చెప్పుకొచ్చారు.

కానీ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. రీసెంట్ గానే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాకు , కనీసం ప్రింట్ ఖర్చులు కూడా రీకవర్ అవ్వలేదంటే నమ్ముతారా?, కానీ అదే జరిగింది. వీకెండ్ పూర్తి అయ్యాక , నేడు హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క షో కూడా లేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో రిజెక్ట్ చేశారు అనేది. అయితే ఆరోజుల్లో జగపతి బాబు తో సరిసమానమైన ఇమేజ్ ని సంపాదించుకున్న శ్రీకాంత్ కూడా చాలా కాలం తర్వాత . ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అనే చిత్రం చేశారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి చాలా డీసెంట్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఒకే కాలానికి చెందిన సమకాలీన హీరోలు , ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యి , మళ్లీ చాలా కాలం తర్వాత హీరో గా చేస్తే ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇది.

‘వదలా ‘ చిత్రం ఇంత పెద్ద ఫ్లాప్ అవ్వడానికి గల కారణం , స్టోరీ నే. స్టోరీ విషయానికి వస్తే , చాలా సంతోషకరమైన జీవితాన్ని తన కుటుంబం తో కలిసి జీవిస్తున్న హీరో, ఒక రోజు రోడ్డు ప్రమాదానికి గురైన ఒక యువతిని కాపాడి , ఆమెకు వైద్యం చేసి బ్రతికిస్తాడు. ఆ తర్వాత ఆ యువతీ హీరో కుటుంబానికి దగ్గర అవుతుంది. హీరో మీద పిచ్చి ఇష్టాన్ని పెంచుకొని , అతనికి దగ్గరయ్యే ప్రతీ ఒక్కరిని టార్చర్ చేస్తుంది. అలా సైకో విలన్ గా మారిన ఈ యువతి నుండి హీరో తన కుటుంబాన్ని ఎలా రేఖించుకున్నాడు అనేదే స్టోరీ. ఇలాంటి సినిమాలు ఈమధ్య కాలం లో ఎన్ని చూసి ఉంటాం?, కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడం వల్లే , ఈ సినిమా ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper