Ustaad Bhagat Singh controversy: ఈ నెల 26 న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఆ మూవీ టీం మొత్తం ప్రొమోషన్స్ కి రెడీ అయ్యింది. ముందుగా డైరెక్టర్ హరీష్ శంకర్ నిన్న కొంతమంది క్రిటిక్స్ తో కలిసి సినిమాకు సంబంధించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాడు . గంటకు పైగా నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూ లో ఆయన సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను పంచుకున్నాడు. ఈ చిత్రం ప్రారంభమైన రోజు నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్త ఏమిటంటే ఇది తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘తేరి ‘ సినిమాకు రీమేక్ అని. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి, మొదట్లో ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు.
కానీ ఎప్పుడైతే రీమేక్ అనే వార్త ప్రచారం అయ్యిందో , అప్పటి నుండి ఈ సినిమా పై ఉన్న అంచనాలన్నీ ఆవిరి అయిపోయాయి. హరీష్ శంకర్ కూడా ఇది రీమేకా ?, కాదా ? అనే విషయం లో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ కూడా ఇది రీమేక్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ ఇంటర్వ్యూ లో హరీష్ శంకర్ దీనిపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘గబ్బర్ సింగ్ రీమేక్ అన్నప్పుడు , నేను ఆ సినిమాలో నా పేరు వేసుకునేటప్పుడు, మార్పులు , డైలాగ్స్ , డైరెక్షన్ హరీష్ శంకర్ అని వేసుకున్నాను. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కూడా ఒక రీమేక్ సినిమాకు అలా వెయ్యలేదు. ఒకవేళ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ రీమేక్ అయితే , దీనికి కూడా అలాగే చేస్తాను కదా, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం హరీష్ శంకర్ అని ఎందుకు వేస్తాను’.
‘తేరి చిత్రంలోనే అనేక సన్నివేశాలు గబ్బర్ సింగ్ నుండి తీసుకొని రీమేక్ చేశారు. అలాంటి సినిమాని మళ్లీ నేనెందుకు రీమేక్ చేస్తాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఇది రీమేక్ కాదు అని మరోసారి స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు హరీష్ శంకర్. కానీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం నమ్మడం లేదు. ఎందుకంటే ‘తేరి’ లో హీరో పోలీస్ , ఇందులో కూడా హీరో ‘పోలీస్ ‘, ‘తేరి’ లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. అందులో హీరోయిన్ సమంత చనిపోతుంది, ఇందులో కూడా హీరోయిన్ శ్రీలీల చనిపోతుంది అనే హింట్ నేరుగా హరీష్ శంకర్ ఇదే ఇంటర్వ్యూ లో ఇచ్చేసాడు. కాబట్టి ఇది కచ్చితంగా రీమేక్, కావాలని దాచుతున్నారు అంటూ సోషల్ మీడియా లో కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే ఈ నెల 26 వరకు ఆగాల్సిందే.
UBS is not theri remake
Clear cut #UstaadBhagatSingh pic.twitter.com/PkS2GSU8OL
— オロチ ⛩️ (@Ojas_Cult) March 2, 2026