Komaram Actor: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఒకటైపోయింది. ఏ భాషలో ఎవరు సినిమా చేసిన కూడా దేశంలో ఉన్న సినిమా ప్రేక్షకులందరు సినిమాలను చూసి వాటిని ఆదరిస్తున్నారు. సక్సెస్ ఫుల్ సినిమాలకి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుందనేది వాస్తవం. ఇక ఇప్పుడు ఇరుముడి మూవీతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న శివ నిర్వాణ కి చాలామంది స్టార్ హీరోల నుంచి అవకాశాలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగులు క్యారెక్టర్ ని పోషించిన కొమరం కి భారీ ఆఫర్లు వస్తున్నాయి… ఇంతకుముందు వరకు లేడీ గెటప్ లో కనిపించిన కొమరం కి ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ పడింది. నిజానికి శివ నిర్వాణ కొమరం లో అలాంటి ఒక గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని చూడడం అతనికి ఆ క్యారెక్టర్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం…
సినిమా సక్సెస్ ని సాధించింది. తన క్యారెక్టర్ కి కూడా మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు అతనికి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయట. ఇక జబర్దస్త్ టీం లీడర్ గా చేసిన వేణు వెల్దండి సైతం ‘బలగం’ సినిమా చేసి దర్శకుడిగా మారాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ‘ఎల్లమ్మ’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా కి వేణు ఎల్దండి కొమరం కి ఫోన్ చేసి చాలా బాగా యాక్ట్ చేశావ్…
నాగులు క్యారెక్టర్ లో జీవించేసావు, నిన్ను నాగుల క్యారెక్టర్ లో చూసిన శివ నిర్వాణ గారికి నిజంగా థాంక్స్ చెప్పుకోవాలి అంటూ వేణు అయితే కొమరం కి చెప్పారట. దాంతో పాటుగా ఎల్లమ్మ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా అని అడగడంతో కొమరం ఏడ్చేసినట్టుగా చెబుతున్నాడు. ప్రస్తుతం ఆతను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా తన 18 సంవత్సరాల కెరియర్లో ఎంతోమంది దర్శకులు తనకి అవకాశాలను ఇచ్చినప్పటికి శివ నిర్వాణ ఇచ్చిన అవకాశం చాలా గొప్పదని ఆయన చెబుతుండడం విశేషం…రాబోయే రోజుల్లో కొమురం కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్లను చేస్తూ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…