Irumudi Movie Collection: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా గతవారం రిలీజై ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను రాబడుతుంది. ఈ సినిమాకి 9 రోజుల్లో 150 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మూవీ ని చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ‘టాక్సిక్’ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఇరుముడి సినిమాకి థియేటర్లు తగ్గించారు. దాంతో ఈ సినిమా కలెక్షన్స్ రెండు మూడు రోజులుగా కొంతవరకు తగ్గాయి. ఇక ఏది ఏమైనా కూడా టాక్సిక్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో మళ్ళీ ఇరుముడి సినిమాకి పూర్వ వైభవం వచ్చింది. ఇరుముడి సినిమా ఏ థియేటర్లో తీసేసారో మళ్లీ ఆ థియేటర్లలో అదే సినిమాని ప్రదర్శింపజేస్తుండటం విశేషం…
జనాలు ఫ్యామిలీతో పాటు ఈ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రవితేజ చాలా రోజుల తర్వాత సూపర్ సక్సెస్ ని సాధించాడు. కాబట్టి ఆయన అభిమానులు సైతం ఆనంద పడుతున్నారు. మధ్యలో రవితేజ కమర్షియల్ సినిమాలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి రొటీన్ సినిమాల వైపు అడుగులు వేశాడు.
కాబట్టి అతనికి అనుకున్న విజయాలైతే రాలేదు. కానీ ఇరుముడి సినిమా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండడం అలాగే హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమా నడవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇలాంటి సినిమాని రవితేజ ఇప్పటివరకు చేయలేదు కాబట్టి ఇది అతనికి ఒక కొత్త అటెంప్ట్ అనే చెప్పాలి.
మొత్తానికైతే శివ నిర్వాణ ఇంతకుముందు చేసిన ‘టక్ జగదీష్’,’ఖుషి’ లాంటి సినిమాలు ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించకపోయిన కూడా ఈ సినిమాని మాత్రం సక్సెస్ ఫుల్ గా నిలిపి ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయడంలో అతను సక్సెస్ అయ్యాడు… ఇక రాబోయే రోజుల్లో కూడా శివ నిర్వాణ చాలా అద్భుతమైన సినిమాలను చేసి తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…