Raviteja: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ఇరుముడి’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే సెన్సేషనల్ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ చిత్రానికి 26 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రెండవ రోజు అయితే మొదటి రోజుకంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 2 వ రోజు ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయలకు పైగా వస్తాయట. బుక్ మై షో యాప్ లో అయితే ఈ చిత్రానికి గంటకు 40 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి.
పాన్ ఇండియన్ సినిమాలకు కూడా ఈ రేంజ్ ట్రెండ్ ఈమధ్య కాలంలో చూడలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా ఈ సినిమా నైజాం ప్రాంతం పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఆ ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి రోజు 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. ఈరోజు అయితే 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని , ఇదే ఊపుతో ఈ చిత్రం ముందుకు వెళ్తే మాత్రం కచ్చితంగా ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రవితేజ కి విడుదలకు ముందే మైత్రీ మూవీ మేకర్స్ రెమ్యూనరేషన్ రూపం లో నైజాం ప్రాంతం హక్కులు ఇచ్చేసారు. విడుదలకు ముందు ఆయన ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు.
ఇప్పుడు ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే , అది మొత్తం రవితేజ కి రెమ్యూనరేషన్ రూపం లో వెళ్తుందట. ఈమధ్య కాలం లో రవితేజ ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒకే ఒక్క హిట్ తో కొడితే కుంభస్థలం బద్దలు కొట్టినట్టు , రవితేజ ఈ సినిమాతో పెద్ద జాక్ పాట్ కొట్టాడనే చెప్పాలి. ఇక రాబోయే రోజుల్లో ఆయన ఇదే తరహా సినిమాలు చేస్తూ వెళ్తే మాత్రం , కచ్చితంగా స్టార్ లీగ్ లోకి రీ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి అది భవిష్యత్తులో జరుగుతుందో లేదో చూడాలి.