spot_img
Homeఎంటర్టైన్మెంట్Photo Story: తెలుగు, తమిళ సినిమాల్లోనూ స్టార్ అయిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

Photo Story: తెలుగు, తమిళ సినిమాల్లోనూ స్టార్ అయిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

Photo Story: బాలీవుడ్ కు ధీటుగా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ సినిమాలు పాన్ వరల్డ్ రేంజ్ లో సక్సెస్ సాధిస్తున్నాయి. దీంతో సౌత్ హీరోలు వరల్డ్ వైడ్ లెవల్లో ఫేమస్ అయి హాలీవుడ్ లోనూ ఛాన్సు లు దక్కించుకుంటున్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఓ హీరో ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాడు. విభిన్న చిత్రాల్లో నటిస్తూ.. స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగులోనూ నేరుగా నటించి ఇక్కడ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల ఆయన చైల్డ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 25న ఆయన బర్త్ డే సందర్భంగా దీనిని ఆయన అభిమానులు బయటపెట్టి విషేష్ చెబుతున్నారు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో తెలుసుకోవాలని ఉందా?

సినిమా ఇండస్ట్రీలో అన్నదమ్ములిద్దరూ స్టార్లు అవుతారని ఎవరూ అనుకోరు. కానీ ఈ ఇద్దరు ఇప్పుడు ఫేమసే. అన్న పాన్ ఇండియా లెవల్లోసినిమాలు తీసి గుర్తింపు సాధిస్తే.. తమ్మడు సౌత్ ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు. విభిన్న చిత్రాల్లో నటిస్తూ వెరైటీ ప్రయోగాలు చేసే ఆయన ఎవరో కాదు.. కార్తీ.. 1977 మే 25న ఆయన శివకుమార్, లక్ష్మీ దంపతులకు తమిళనాడులో జన్మించారు. అన్న సూర్య ను స్ఫూర్తిగా తీసుకొని కార్తీ 2007 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

‘పరుత్తి వీరన్’ అనే సినిమాలో నటించిన కార్తీకి మొదటి సినిమాతోనే సౌత్ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఆ తరువాత 2007 లో ‘అయరతిల్ ఒరువాన్’ అనే మూవీలో నటించారు. దీనిని తెలుగులో ‘యుగానికి ఒక్కడు’ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాతో కార్తీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తరువాత కార్తీ తమిళంలో నటించిన సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ కావడం అవి ఇక్కడ కూడా సక్సెస్ కావడంతో ఈయన సౌత్ లెవల్లో స్టార్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

తన సినిమాల ఏ భాషలో రిలీజ్ అయినా తన వాయిస్ నే డబ్బింగ్ చెప్పుకునే హీరోగా కార్తీ నిలుస్తారు. ఇక కార్తీ పర్ఫామెన్స్ ను చూసి కొందరు తెలుగు డైరెక్టర్లు ఆయనతో నేరుగా సినిమాలు తీశారు. నాగార్జున తో కలిసి కార్తీ ‘ఊపిరి’ సినిమాలో కనిపించి విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ కావడంతో తెలుగులో కార్తీకి అభిమానులు పెరిగాయి. రీసెంట్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2తో కార్తీ మరోసారి ప్రేక్షకులను అలరించాడు. మే 25న ఆయన బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. కొన్ని టీవీ చానెళ్లు కార్తీ సినిమాలు వేస్తూ ఆకట్టుకుంటున్నాయి. కార్తీ మరో తెలుగు సినిమా తీయాలని కొందరు నెట్టింట్లోరిక్వెస్ట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా కార్తీకి మీరూ శుభాకాంక్షలు తెలపండి..

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper