spot_img
Homeఎంటర్టైన్మెంట్Boyapati Srinu: యాక్షన్ డైరెక్టర్ లో యాక్షనే కాదు, ఎమోషనూ ఉంది...

Boyapati Srinu: యాక్షన్ డైరెక్టర్ లో యాక్షనే కాదు, ఎమోషనూ ఉంది !

Boyapati Srinu: నటసింహం బాలయ్య ‘అఖండ’ భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. కాగా అఖండ మూవీ 50 రోజులకు చేరువలో ఉన్న సందర్భంగా చిత్ర యూనిట్ సంక్రాంతి సంబరాలు అనే పేరుతో ఒక ఈవెంట్ పెట్టింది. అయితే, ఈ ఈవెంట్ లో బోయపాటి మాట్లాడుతూ.. ‘అఖండ సీక్వెల్ కచ్చితంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు.

Boyapati Srinu
Boyapati Srinu

పైగా అఖండ సినిమాకు సీక్వెల్ కు కావాల్సిన లీడ్ ను సినిమాలో చూపించానని, కాకపోతే, సీక్వెల్ ఎప్పుడుంటుందనేది తర్వాత చెబుతాను అంటూ అఖండ సంక్రాంతి సంబరాల్లో బోయపాటి తెలిపాడు. ఇక బోయపాటి ఎమోషనల్ అవుతూ.. ‘ఈ అఖండ సినిమా ద్వారా తాను తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటికి పరిచయం అయ్యానని, అయితే, బాలయ్య బాబు గారు తనమీద పెట్టుకున్న నమ్మకంతోనే ఈ సినిమా తెరకెక్కించానని బోయపాటి చెప్పాడు.

Also Read:  రిలీజుకు రెడీ అవుతున్న ‘అవతార్ 2’.. డేట్ ఫిక్స్..!

ఇక సంక్రాంతి సంబరాల సందర్భంగా ‘అఖండ’ నుంచి సరికొత్త ట్రైలర్‌ ను రిలీజ్ చేసింది టీమ్. ఈ ట్రైలర్ బాలయ్య, శ్రీకాంత్ డైలాగులతో హోరెత్తించిందనే చెప్పాలి. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఐదో వారంలో కూడా ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ను కలెక్ట్ చేసింది. మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో అఖండ ఏ మాత్రం తగ్గ లేదు.

నిజానికి ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా లాభాల్లోనే నడుస్తోంది. ఒక విధంగా కరోనా సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఊపు కనిపించలేదు. తెలుగు సినిమాకి కరోనా అనంతరం సాలిడ్ హిట్ అందించిన సినిమాగా కూడా అఖండ నిలిచింది. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ హిట్ కూడా పడింది.

అన్నిటికి మించి ‘అఖండ’ సినిమాకు రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది. జరిగింది అనే దానికంటే నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఓవర్ గా సినిమాను అమ్మలేదు. దాంతో బయ్యర్లు ఈ సినిమాతో ఫుల్ లాభాల్లోకి వెళ్లారు. మొత్తమ్మీద ఈ చిత్రం 5 వారాలు పూర్తయ్యేసరికి రూ.70.85 కోట్ల షేర్ ను ఈ చిత్రం రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి ఫుల్ గా లాభాలు వచ్చాయి.

Also Read: అరెరే.. ఆ శృంగార తార కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోలేదట !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper