
Manmathudhu movie heroine ‘Anshu : కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా నెగ్గుకొచ్చే సత్తా ఉన్నప్పటికీ కూడా ఎందుకో కేవలం ఒకటి రెండు సినిమాలతోనే కెరీర్ ముగించేస్తారు.కొంతమందికి డైరెక్టర్స్ చెప్పిందల్లా చెయ్యడం ఇష్టం ఉండదు,అందుకే వాళ్ళు కోరుకున్న పాత్రలు వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు, లేదంటే అసలు సినిమాలు చేయడమే మానేస్తారు.మరికొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాల తర్వాత పెళ్లిళ్లు చేసుకొని సినిమా కెరీర్ కి బైబై చెప్పేస్తారు.
అలా టాలీవుడ్ లో కేవలం రెండు సినిమాల్లో తళుక్కుమని మెరిసి మాయమైన హీరోయిన్ ‘అన్షు’ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘మన్మధుడు’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే అన్షు ,అందులో అమాయకురాలిగా ఎంత చక్కగా నటించిందో అందరికీ తెలిసిందే.టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ హిట్ గా నిల్చిన ఈ సినిమా తర్వాత ఆమె ప్రభాస్ రెండవ చిత్రం ‘రాఘవేంద్ర’ లో హీరోయిన్ గా నటించింది.

ఆ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఈమె తెలుగు సినిమాల్లో కనిపించడం మానేసింది.ఆ తర్వాత ఈమె సచిన్ సాగర్ అనే ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్ళాడి లండన్ లో స్థిరపడింది.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇది ఇలా ఉండగా సినిమాలకు ఆమె దూరమైనప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా ఆమె తరచూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది.
తనకి మరియు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఒకప్పుడు ఎంతో క్యూట్ గా అందంగా కనిపించే అన్షు, ఇప్పుడు ముఖం లో గ్లో మొత్తం పొయ్యి అందం పూర్తిగా కోల్పోయింది.అయ్యినప్పటికీ కూడా మోడరన్ డ్రెస్ లు వేసుకుంటూ హాట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంది.ఆమె లేటెస్ట్ ఫోటో ఒకటి క్రింద మీకోసం ఎక్సక్లూసివ్ గా అందిస్తున్నాము చూడండి.