Tollywood Heroines: సినిమాల్లో లవ్, ఆ తర్వాత పెళ్లి కామన్ గా చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో కూడా అదే స్టార్లు లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవడం రేర్. కానీ ఈ మధ్య ప్రేమ పెళ్లిల్లు సినిమా ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్ లు గా ఎదిగి ఆ తర్వాత భర్తకు ఇష్టం లేక సినిమా ఇండస్ట్రీని వదిలిన హీరోయిన్ లు ఎవరో ఓ సారి లుక్ వేసేద్దాం..
నమ్రత.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నమ్రత తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించింది.. వంశీ సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య స్నేహం, ప్రేమ చిగురించాయి. ఆ తర్వాత 2005లో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు ఈ జంట. అయితే ఈమె హీరోయిన్ అవడంతో ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అనుకున్నారట. కానీ మహేష్ కుటుంబ సభ్యులకు పెళ్లి తర్వాత నమ్రత సినిమాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పడంతో.. మహేష్ కోసం సినిమాలు మానేసింది నమ్రత.
శాలిని: శాలిని గురించి కాస్త పరిచయం తక్కువ అయినా.. గతంలో ఈమెకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించింది శాలిని. ఇక తమిళ హీరో అజిత్ తో ప్రేమలో పడింది ఈ అమ్మడు. ప్రేమించుకున్న ఈ జంట చెన్నైలో పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈమె కూడా సినిమాల్లో నటించడం అజిత్ ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటూ.. వ్యాపార రంగంలో బిజీగా అయింది.
ఆసిన్.. ఆసిన్ గురించి పరిచయం అవసరం లేదు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి అనే సినిమాతో ప్రేక్షకుల మదిలో చెదరని గూడు కట్టుకుంది. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మరింత గుర్తింపు సంపాదించింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే మైక్రోసాఫ్ట్ సీఈవో రాహుల్ శర్మ అనే వ్యక్తిని వివాహం చేసుకొని పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది.
అన్షు.. నాగార్జున నటించిన మన్మధుడు సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో అమాయకపు పాత్ర లో నటిస్తూ తన అందంతో యూత్ ను ఆకట్టుకున్న బ్యూటీ అన్షు. ఆ తర్వాత రాఘవేంద్ర నటించిన సినిమాలో నటించి మెప్పించింది. కెరీర్ బాగున్నప్పుడే లండన్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ అమ్మడు. పెళ్లి తర్వాత అన్షు సినిమాల్లో నటించడం భర్తకు ఇష్టం లేకపోవడంతో డిజైనింగ్ రంగంలో స్థిరపడింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Heroines who are away from movies after marriage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com