Prabhas Marriage: ప్రభాస్ గురించి ఇండియాలోనే పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో ఏ మూలకు వెల్లినా ఈయన అభిమానులు ఉండేలా చేసుకున్నారు ఈ స్టార్ హీరో. మొదటి నుంచి స్టార్ స్టేటస్ సంపాదించిన ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాలో నెంబర్ 1 బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే హిందీ హీరోలకు కేవలం బాలీవుడ్ లోనే ఎక్కువ క్రేజ్ ఉంది.
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ కొందరు హిందీ స్టార్లు అభిమానులను సంపాదించారు. కానీ ప్రభాస్ మాత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ వంటి ఇండస్ట్రీలలో ఎంతో మంది అభిమానులను సంపాదించారు. బాహుబలి సిరీస్ తర్వాతనే ఈ రేంజ్ ప్రభాస్ కు వచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. కానీ ఆ ఫ్లాప్ చిత్రాలకు వచ్చిన కలెక్షన్లు ఇతర స్టార్ల హీరోల హిట్ సినిమాలకంటే ఎక్కువ వసూళ్లనే రాబట్టాయి.
ఫ్లాప్ సినిమాలకే ఈ రేంజ్ లో వసూళ్లను సాధిస్తే.. హిట్ సినిమాలకు ఎలాంటి రిజల్ట్ వస్తాయో లెక్కలు వేసుకొని మురిసిపోతున్నారు డార్లింగ్ అభిమానులు. అయితే ఇలాంటి స్టార్ హీరో గురించి ఇప్పుడు ఒక వార్త వైరల్ గా మారింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు ప్రభాస్. ఇక త్వరలోనే ఈయన పెళ్లి ఉండబోతుంది అనే టాక్ ఎప్పటి నుంచో వస్తుంది. దీనికి తోడు హైదరాబాద్ కు కాస్త దూరంగా రూ. 120 కోట్ల విలువ చేసే భూములను కొనుగోలు చేసాడట ప్రభాస్. ఇందులో రూ. 200 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని నిర్మించబోతున్నట్టు టాక్ కూడా ఉంది.
ఎప్పుడు లేనిది ప్రస్తుతం ఇంటి నిర్మాణం చేపట్టడానికి కారణం ఏంటి? ఎందుకు ప్రభాస్ ఈ ఇంటిని నిర్మిస్తున్నారు అనే అనుమానాలు వస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. కానీ ఈ ఇంటిని తన కాబోయే భార్య కోసమని.. ఆమెకు గిఫ్ట్ గా ఇవ్వడానికే ప్రభాస్ ఈ ఇంటి నిర్మాణం చేపడుతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే ప్రభాస్ స్పందించాల్సిందే.