Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారమే రెండు షాకింగ్ ఎలిమినేషన్స్ జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆడియన్స్ ఓటింగ్ బలంగా ఉన్నప్పటికీ చరణ్ లాంటి కంటెస్టెంట్ ని హౌస్ మేట్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆయన రీ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉండిపోయింది కానీ , కచ్చితంగా రీ ఎంట్రీ ఉంటుందనే ఆశతోనే ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు రోహిత్ , షాలిని , రామ్ ప్రసాద్, దేబ్జాని, వర్షిణి, సుధీర్ రెడ్డి, త్రిగున్ , కృష్ణుడు , శ్రేష్టి , ఝాన్సీ , ముకేశ్.
వీరిలో ప్రస్తుతానికి అందరి కంటే తక్కువ ఓటింగ్ ని నమోదు చేసుకుంటున్న కంటెస్టెంట్ కృష్ణుడు. ఈ వారం ఆయన హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి. అయితే బిగ్ బాస్ మేకర్స్ ఎలాగో ఆడియన్స్ ఓటింగ్ కి ఈ సీజన్ లో విలువ ఇవ్వడం లేదు కాబట్టి , చివరి నిమిషం లో ఏదైనా ట్విస్టులు ఇచ్చి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడితే సెలబ్రిటీల ఓటింగ్ లో ఎలాగో కృష్ణుడు సేవ్ అయిపోతాడు. అప్పుడు మళ్లీ ఎదో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ఈ షో డిజాస్టర్ వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. కృష్ణుడు ఇప్పటి వరకు ఆడిన గేమ్ ఏమి లేదు.
త్రిగున్ ఈయనతో ముచ్చట్లు పెడుతూ ఉంటాడు కాబట్టి , ఆయన కారణంగా కాస్త స్క్రీన్ స్పేస్ దక్కుతుంది కానీ , ఇప్పటి వరకు ఈయన తన మార్క్ గేమ్ ఏంటో చూపించలేదు. నిన్న రోప్స్ విప్పే టాస్క్ లో కాస్త ఎఫోర్ట్స్ చూపించాడు. ఆ శరీరం తో ఆ మాత్రం చేయడం చాలా ఎక్కువ అని అంతా అనుకున్నారు. కానీ అది సరిపోదు. ఆడియన్స్ ఓటింగ్ పడాలంటే ఒక రేంజ్ లో షైన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వారం లో అలాంటి ఎపిసోడ్ కృష్ణుడు కి పడితే ఎలిమినేషన్ నుండి తప్పించుకోవచ్చు. ఇక కృష్ణుడు తో పాటు వర్షిణి కూడా డేంజర్ జోన్ లో ఉంది. గత వారం లో డేంజర్ జోన్ లో ఉన్నటువంటి సుధీర్ నిన్నటి ఎపిసోడ్ తో గ్రాఫ్ మంచిగా పెంచుకున్నాడు. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.