Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: రోహిత్ కోసం కొట్లాడుకునే స్థాయికి వెళ్లిన షాలిని వర్షిణి..చివరికి ఏమైందంటే!

Bigg Boss 10 Telugu: రోహిత్ కోసం కొట్లాడుకునే స్థాయికి వెళ్లిన షాలిని వర్షిణి..చివరికి ఏమైందంటే!

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ప్రేక్షకుల అంచనాలను మించిపోయింది. ముఖ్యంగా జియో హాట్ స్టార్ లో వచ్చే లైవ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు హాట్ స్టార్ లో ఈ లైవ్ ని దాదాపుగా 2 కోట్ల 20 లక్షల మంది వీక్షించారు. ఇది ఒక రికార్డు అని చెప్పొచ్చు. అయితే హాట్ స్టార్ లైవ్ లో కాసేపటి క్రితమే నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యింది. నేడు […]

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ప్రేక్షకుల అంచనాలను మించిపోయింది. ముఖ్యంగా జియో హాట్ స్టార్ లో వచ్చే లైవ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు హాట్ స్టార్ లో ఈ లైవ్ ని దాదాపుగా 2 కోట్ల 20 లక్షల మంది వీక్షించారు. ఇది ఒక రికార్డు అని చెప్పొచ్చు. అయితే హాట్ స్టార్ లైవ్ లో కాసేపటి క్రితమే నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యింది. నేడు రాత్రి ఈ ప్రక్రియ కి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అయితే ఈ నామినేషన్స్ ప్రక్రియ ఊహించిన దానికంటే మంచి ఫైర్ మీద సాగింది. ముఖ్యంగా సుధీర్ రెడ్డి ఇచ్చిన ట్విస్ట్ కి పాపం త్రిగున్ బుర్ర బ్లాస్ట్ అయ్యింది అనే చెప్పాలి. ఈ రేంజ్ లో ట్విస్ట్ ఇస్తాడని కలలో కూడా ఊహించలేకపోయారు త్రిగున్.

అతని సంగతి కాసేపు పక్కన పెడితే , ఈ నామినేషన్స్ ప్రక్రియ లో అసలు సంబంధమే లేని వర్షిణి, షాలిని కొట్లాడుకోవడం మరో హైలైట్ గా నిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే , నరేష్ షాలిని ని నామినేట్ చేసి పాయింట్స్ చెప్పిన వెంటనే , సెలబ్రిటీ కంటెస్టెంట్స్ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. దీనికి ట్రిగర్ అయినటువంటి షాలిని , ఇలా ఒకరి నామినేషన్స్ లో సంబంధం లేకపోయినా మధ్యలో దూరి చప్పట్లు కొట్టడం చాలా తప్పు అనిపిస్తోంది , అది సదరు కంటెస్టెంట్ ని అవమానించినట్టుగా నేను భావిస్తాను అంటూ చెప్పుకొచ్చింది షాలిని. అయితే త్రిగున్ ఎప్పుడైతే రోహిత్ ని నామినేట్ చేస్తూ పాయింట్స్ పెట్టాడో, అప్పుడు ఆయన అగ్ని పరీక్ష గ్రూప్ టాపిక్ ని తీసుకొస్తాడు. రోహిత్ ఈ పాయింట్ మీద డిఫెండ్ చేస్తున్నప్పుడు షాలిని మధ్యలో చొరవ తీసుకొని , కరెక్ట్ గా చెప్పావు , నీతో నేను కూడా అంగీకరిస్తున్నాను అని అంటుంది.

దీనికి వర్షిణి మధ్యలో రియాక్ట్ అవుతూ, ఇందాక చప్పట్లు కొట్టినప్పుడు పెద్ద క్లాస్ పీకావు , ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి?, వాళ్ళిద్దరి నామినేషన్ లో నువ్వు ఎందుకు మధ్యలో దూరావు అంటూ ప్రశ్నించింది. దీనికి షాలిని సమాధానం ఇస్తూ ‘అగ్ని పరీక్ష’ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి , ఆ గ్రూప్ లో నేను కూడా ఉన్నాను కాబట్టి రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని అంటుంది. ఈ విషయం పై ఇద్దరు వాదనలు చేసుకున్నారు, కొట్లాట వరకు వెళ్ళింది. షాలిని వర్షిణి మీదకు వెళ్తున్నప్పుడు , వర్షిణి ఆమెని నెట్టేయడం హాట్ టాపిక్ గా మారిన అంశం. వీకెండ్ లో ఈ అంశం పై నాగార్జున వీళ్లిద్దరికీ ఫుల్ క్లాస్ పీకే అవకాశం ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper