spot_img
Homeఎంటర్టైన్మెంట్Heroine Kavya : నాపై జరిగేదంతా అసత్య ప్రచారం.. బలగం హీరోయిన్ ప్రకటన

Heroine Kavya : నాపై జరిగేదంతా అసత్య ప్రచారం.. బలగం హీరోయిన్ ప్రకటన

Heroine Kavya : కొద్ది రోజులుగా తన గురించి వైరల్ అవుతున్న ఓ వార్తపై బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ స్పందించారు. అదంతా అసత్య ప్రచారం అంటూ కొట్టి పారేశారు. ఒక సందర్భంలో కావ్య కళ్యాణ్ రామ్ తనకు పరిశ్రమలో అవమానాలు ఎదురయ్యాయని చెప్పారట. కొందరు దర్శకులు, నిర్మాతలు తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారట. బొద్దుగా ఉన్నావు. ఇలా ఉంటే హీరోయిన్ కాలేవని అవమానకర కామెంట్స్ చేశారట. ఆఫర్స్ కోసం ప్రయత్నం చేసే రోజుల్లో ఇలాంటి దారుణ పరిణామాలు ఎదుర్కొన్నట్లు, కావ్య కళ్యాణ్ రామ్ చెప్పారని సదరు కథనాల సారాంశం.

గత వారం రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారానికి కావ్య చెక్ పెట్టారు. ఆమె ట్విట్టర్ వేదికగా స్పష్టత ఇచ్చారు. ఇదంతా అవాస్తవం. నేను ఎక్కడా ఇలాంటి కామెంట్స్ చేయలేదు. నేను ఎవరి వలన బాడీ షేమింగ్ కి గురి కాలేదని అన్నారు. దర్శకులు నాపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని నేను చెప్పినట్లు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అందులో వాస్తవం లేదు. నేను ఎక్కడా అలాంటి కామెంట్స్ చేయలేదు. దయచేసి ఈ ప్రచారం ఆపేయండి, అంటూ ట్వీట్ చేశారు.

కావ్య కళ్యాణ్ రామ్ ట్వీట్ నేపథ్యంలో అదంతా అసత్య ప్రచారమే అని తేలిపోయింది. బలగం మూవీతో కావ్య భారీ హిట్ అందుకున్నారు. దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడింది. పలు అవార్డ్స్ కొల్లగొట్టింది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్ గా నటించారు.

బలగం మూవీ కావ్య కళ్యాణ్ రామ్ కి గుర్తింపు తెచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కావ్య పదికి పైగా చిత్రాలు చేశారు. గంగోత్రి, బాలు వంటి చిత్రాల్లో తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మసూద మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రీసింహకు జంటగా ఉస్తాద్ మూవీ చేస్తుంది. ఉస్తాద్ విడుదల సిద్ధం అవుతుంది. మరి కావ్య హ్యాట్రిక్ పూర్తి చేస్తుందేమో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper