Hansika: ప్రముఖ స్టార్ హీరోయిన్ హన్సిక(Hansika Motwani) రీసెంట్ గానే తన భర్త నుండి విడాకులు తీసుకున్న ఘటన సోషల్ మీడియా లో సంచలన టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఆమె తన వదిన నాన్సీ జేమ్స్ పై పరువు నష్టం దావా కేసు వెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతం లో నాన్సీ జేమ్స్ తన అత్తవారింట్లో గృహ హింస, మానసిక వేధింపులకు గురయ్యానని, తక్షణమే తనకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా తన సోషల్ మీడియా అకౌంట్ లో, అదే పనిగా హన్సిక మరియు ఆమె కుటుంబం పై ఆరోపణలు చేస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండేది. దీనిపై హన్సిక చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
నా స్టార్ ఇమేజ్ ని వాడుకుంటూ, తమ ఇంట్లో వాళ్లపై నాన్సీ అసత్యాలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ , తమ గౌరవానికి భంగం కలిగిస్తోందని, కేవలం మా వైపు నుండి అత్యధిక డబ్బులు వసూలు చెయ్యాలనే దురాలోచనతో ఆమె ఇలాంటి పనులు చేస్తుందని, తక్షణమే ఆమె పై చర్యలు తీసుకోవాలని కోరుతూ, కోర్టు లో 2 కోట్ల రూపాయిల పరువు నష్టం దావా వేసింది హన్సిక. చాలా కాలం వరకు ఓర్పుతో , సహనం తో ఉన్నానని , కానీ ఇప్పుడు ఆమె హద్దులు దాటడంతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ కేసు ని స్వీకరించి విచారించిన కోర్టు నాన్సీ జేమ్స్ కి కీలక ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులను అందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా హన్సిక పై , ఆమె తల్లి పై ఆరోపణలు చేయడం , వాళ్ళ పరువుకు భంగం కలిగించడం చట్ట రీత్యా నేరమని , తక్షణమే వాళ్ళ మీద చేసిన వీడియోలను సోషల్ మీడియా నుండి తొలగించాలని ఆదేశించింది.
హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ కూడా ఈ విషయం లో తన సోదరి కి అండగా నిలిచాడు. తన భార్య చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆయన చెప్పుకొచ్చాడు . పెళ్ళైన కొత్తల్లోనే తనకు నాన్సీ తో విబేధాలు ఏర్పడ్డాయని , వాటిని ఆమె కుటుంబం వరకు తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నాడు. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇకపోతే హన్సిక గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఆమె నుండి చివరగా విడుదలైన చిత్రం ‘గార్డియన్’ . 2024 వ సంవత్సరం లో విడుదలైన ఈ తమిళ సినిమా తర్వాత , ఆమె మరో సినిమాకు సంతకం చేయలేదు. అదే సంవత్సరం లో ఆమె ఈటీవీ లో ప్రసారమైన ‘ఢీ : సెలబ్రిటీ స్పెషల్’ ప్రోగ్రాం కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది.