spot_img
Homeజాతీయ వార్తలుMamata Banerjee Assets: ఆస్తుల వివరాలు వెల్లడించిన మమతా బెనర్జీ.. అవాక్కైన అధికారులు..

Mamata Banerjee Assets: ఆస్తుల వివరాలు వెల్లడించిన మమతా బెనర్జీ.. అవాక్కైన అధికారులు..

Mamata Banerjee Assets: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ కొనసాగుతున్నారు. కమ్యూనిస్టు పార్టీ సుదీర్ఘ పరిపాలన ను కాదనుకొని తనకు ఓటు వేసేలా బెంగాల్ ప్రజలను ఆమె చైతన్యవంతం చేశారు. ఫలితంగా వరుసగా ఆమె ముఖ్యమంత్రిగా అక్కడ పని చేస్తున్నారు. కాకపోతే మొదట్లో మమత పరిపాలన మీద పట్టు సాధించారు. ఆ తర్వాత ఆమె మేనల్లుడు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి మారిపోయింది. అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు పెరిగిపోయాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్లకు బెంగాల్ ఎర్ర తివాచీ పరుస్తోంది. వారికి ఓటు హక్కు కూడా కల్పించి.. తమకు వేసేలా ప్రణాళికలు రూపొందించింది.

ఇటీవల దొంగ ఓట్లను నిర్మూలించే కార్యక్రమానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. అయితే దీనిని మమత వ్యతిరేకించారు. ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం అధికారులకు స్థానిక సిబ్బంది సహాయం చేయకుండా నిరసన తెలిపారు. ఇలా బిజెపితో మమతా బెనర్జీ ఒక రకమైన యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. మమతా బెనర్జీ అధికారాన్ని కాపాడుకోవడానికి హింసాత్మక ఘటనలకు కూడా వెనుకాడటం లేదు. పైగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు.

త్వరలో బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ అఫిడవిట్ ప్రకటించారు. అందులో తెలిపిన వివరాల ప్రకారం మమతా బెనర్జీకి 9.8 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. చేతిలో 75,700. బెనర్జీకి సొంత ఇల్లు లేదు. సొంత కారు కూడా లేదు. మమత బెనర్జీ ఆస్తుల వివరాలు చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. మనదేశంలో అత్యంత పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ నిలిచారు. మమతా బెనర్జీ తర్వాత స్థానంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా 55 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి విజయన్ కోటి రూపాయల ఆస్తులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మమత బెనర్జీ అన్నీ అబద్ధాలు చెప్పారని.. ఆమె వద్ద భారీగా ఆస్తులు ఉన్నాయని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని ఆమె తప్పు తోవ పట్టించారని మండిపడుతున్నారు. ఆమె పోటీ చేస్తున్న భవానిపూర్ నియోజకవర్గం నుంచి కచ్చితంగా ఓడిపోతారని బిజెపి నేతలు అంటున్నారు.

బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. బిజెపి నేతలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. బెంగాల్ రాష్ట్రంలో అధికారం మరోసారి తమదేనని.. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు మరోసారి గెలిపిస్తాయని మమతా బెనర్జీ ప్రకటించారు. మమతా బెనర్జీ కి దీటుగా బిజెపి నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.. మమత బెనర్జీకి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper