Homeఎంటర్టైన్మెంట్Podarillu Serial: 'పొదరిల్లు' సీరియల్ టైమింగ్ లో భారీ మార్పు.. హీరోయిన్ మారనుందా?

Podarillu Serial: ‘పొదరిల్లు’ సీరియల్ టైమింగ్ లో భారీ మార్పు.. హీరోయిన్ మారనుందా?

Podarillu Serial: స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం టాప్ 2 స్థానం లో కొనసాగుతున్న సీరియల్ ‘పొదరిల్లు’. ప్రతీ వారం సగటున ఈ సీరియల్ కి 8 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయంటే సాధారణమైన విషయం కాదు. టెలికాస్ట్ అయిన కొద్దిరోజులకే ఈ రేంజ్ రెస్పాన్స్ ని బహుశా ఈ సీరియల్ మేకర్స్ కూడా ఊహించి ఉండరు. ‘కార్తీక దీపం’ సీరియల్ లో హీరో గా నటించిన నిరుపమ్ ఈ సీరియల్ కి నిర్మాతగా […]

Podarillu Serial: స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం టాప్ 2 స్థానం లో కొనసాగుతున్న సీరియల్ ‘పొదరిల్లు’. ప్రతీ వారం సగటున ఈ సీరియల్ కి 8 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయంటే సాధారణమైన విషయం కాదు. టెలికాస్ట్ అయిన కొద్దిరోజులకే ఈ రేంజ్ రెస్పాన్స్ ని బహుశా ఈ సీరియల్ మేకర్స్ కూడా ఊహించి ఉండరు. ‘కార్తీక దీపం’ సీరియల్ లో హీరో గా నటించిన నిరుపమ్ ఈ సీరియల్ కి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రతీ రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ టైమింగ్స్ ఇప్పుడు పూర్తిగా మారిపోనున్నాయి. త్వరలోనే ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ పూర్తి కాబోతుండడం తో , ఆ స్థానం లోకి ‘పొదరిల్లు’ సీరియల్ ని షిఫ్ట్ చేస్తున్నట్టు సమాచారం. అంటే ప్రతీ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు అన్నమాట.

కానీ ఈ నెల 29 వ తేదీ వరకు ఈ సీరియల్ ప్రతీ రోజు మామూలు టైమింగ్స్ లోనే టెలికాస్ట్ కానుంది. ఇంతకు ముందు కేవలం సోమవారం నుండి శనివారం వరకు మాత్రమే స్టార్ మా ఛానల్ లో సీరియల్స్ ని టెలికాస్ట్ చేసేవారు. కానీ ఇప్పటి నుండి ఆదివారం కూడా టెలికాస్ట్ చేయనున్నారు అట. ఇదంతా పక్కన పెడితే ‘పొదరిల్లు’ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న కృత్తిక కి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడూ సీరియల్స్ అలవాటు లేని వాళ్ళు కూడా , ఈమె కోసం ఈ సీరియల్ ని చూడడం మొదలు పెట్టారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సీరియల్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సీరియల్ నుండి కృత్తిక తప్పుకుంటుంది అంటూ సోషల్ మీడియా లో నిన్న మొన్నటి నుండి ఒక ప్రచారం సాగుతోంది.

ఎందుకంటే కృత్తిక ‘బిగ్ బాస్ 10’ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతుందని , రీసెంట్ గానే ‘అగ్నిపరీక్ష 2’ షూటింగ్ లో కూడా పాల్గొనింది అని , కచ్చితంగా ఈమె సీరియల్ నుండి తప్పుకునే అవకాశం ఉందంటూ ప్రచారం సాగింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదట. కృత్తిక ‘అగ్నిపరీక్ష 2’ షూటింగ్ లో పాల్గొన్న విషయం వాస్తవమే. కానీ ఆమె తన ‘పొదరిల్లు’ సీరియల్ కొత్త టైమింగ్స్ ని ప్రమోట్ చేయడం కోసం ఈ షో లో పాల్గొన్నది అట. కేవలం ఈ ఒక్క షో లో మాత్రమే కాదు , అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఆమె పాల్గొని తన ‘పొదరిల్లు’ సీరియల్ టైమింగ్స్ ని ప్రమోట్ చేసిందట. కాబట్టి ఈమె ‘బిగ్ బాస్ 10’ లోకి వస్తుంది అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper