OTT Movies: తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ , ఐశ్వర్య లక్ష్మి హీరో హీరోయిన్లు గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మట్టి కుస్తీ 2’. రీసెంట్ గానే తమిళం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం , మంచి కమర్షియల్ సక్సెస్ గా నిలిచి , దాదాపుగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 2022 వ సంవత్సరం లో విడుదలైన ‘మట్టి కుస్తీ’ చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అప్పట్లో తెలుగు లో మాస్ మహారాజ రవితేజ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా విడుదల చేశారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. అందుకే ‘మట్టి కుస్తీ 2’ తెలుగు వెర్షన్ థియేటర్స్ లో విడుదల అవ్వలేదు. కేవలం తమిళం లో మాత్రమే విడుదలైంది. అయితే రీసెంట్ గానే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళం తో పాటు తెలుగు , హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
తన భార్య కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) ని కుస్తీ ఛాంపియన్ గా నిలబెడుతామనని మాటిచ్చిన వీర (విష్ణు విశాల్) ఎట్టకేలకు తన మాటని నిలబెట్టుకుంటాడు. కీర్తి ఒకపక్క కుస్తీ పోటీలలో పాల్గొంటూనే , మరోపక్క రైల్వే ఉద్యోగం చేస్తూ , కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. కానీ భర్త వీర కి మాత్రం ఎలాంటి ఉద్యోగం సద్యోగం లేదు. ఇంట్లోనే కూర్చొని పిల్లల బాగోగులు చూస్తుంటాడు. దీనిని అవకాశం గా తీసుకున్న కోచ్ (తారక్ పొన్నప్ప) కీర్తి కుస్తీ కెరీర్ ని నాశనం చెయ్యాలని అనుకుంటాడు. ఎందుకంటే కీర్తి కి వస్తున్నంత గుర్తింపు ఆ కోచ్ కి రావడం లేదు కాబట్టి. అందుకు వీర ని ఒక పావు లాగా వాడుకుంటాడు. భార్య సంపాదన మీద బ్రతికే భర్త అంటూ సమాజం అతన్ని వెక్కిరిస్తోంది అనే విషయాన్ని గుర్తు చేసి , వీర ఈగో ని రెచ్చగొడుతాడు. దీంతో కీర్తి , వీర మధ్య గొడవలు ఏర్పడి విడాకుల వరకు దారి తీస్తుంది. కీర్తి కి జాతీయ స్థాయిలో కుస్తీ పోటీలలో పాల్గొనే అర్హత కూడా కోల్పోయేలా చేస్తాడు వీర. చివరికి ఏమైంది అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ :
సీక్వెల్ ని హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు , సాధారణంగానే సీక్వెల్ అంటే అంచనాలు ప్రేక్షకుల్లో భారీ రేంజ్ లో ఉంటాయి. వాటిని అందుకునే తీయడమంటే కత్తి మీద సాము లాంటిదే. అందుకే డైరెక్టర్ చెల్లా అయ్యావు ఎలాంటి ప్రయోగాలకు పోకుండా , ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి కమర్షియల్ పద్దతిలోనే తెరకెక్కించాడు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం లో చాలా వరకు ఆయన సక్సెస్ సాధించాడు అనే చెప్పాలి. ఆరంభం కాస్త రొటీన్ గానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే కీర్తి జాతీయ స్థాయి పోటీల్లో పోరాడే అర్హత కోల్పోతుందో , అప్పటి నుండి భార్య భర్తల మధ్య ఏర్పడే సంఘర్షణ , ఆ తర్వాత జరిగే ఎమోషనల్ జర్నీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి భాగం లో లాగానే రెండవ భాగం లో హీరో విష్ణు విశాల్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి చాలా అద్భుతంగా నటించారు. ఓవరాల్ గా ఈ చిత్రాన్ని కుటుంబం తో కలిసి ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దారు మేకర్స్. ఈ వీకెండ్ లో ఆడియన్స్ కి మంచి టైం పాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఆలస్యం లేకుండా చూసేయండి.