Homeఎంటర్టైన్మెంట్Karuppu Movie: 'కరుప్పు' చిత్రాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో అతనేనా..? చేసుంటే 1000...

Karuppu Movie: ‘కరుప్పు’ చిత్రాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో అతనేనా..? చేసుంటే 1000 కోట్లు కొట్టేది..

Karuppu Movie: ‘ ఒక హీరో చేయాల్సిన సినిమాని మరో హీరో చేయడం అనేది ఏ ఇండస్ట్రీ లో అయినా సర్వసాధారణం , గతం లోనే కాదు , రీసెంట్ గా కూడా అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అందులో మరో లేటెస్ట్ ఉదాహరణ ‘కరుప్పు’. సూర్య హీరో గా నటించిన ఈ చిత్రం రీసెంట్ గానే విడుదలై ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్ […]

Karuppu Movie: ‘ ఒక హీరో చేయాల్సిన సినిమాని మరో హీరో చేయడం అనేది ఏ ఇండస్ట్రీ లో అయినా సర్వసాధారణం , గతం లోనే కాదు , రీసెంట్ గా కూడా అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అందులో మరో లేటెస్ట్ ఉదాహరణ ‘కరుప్పు’. సూర్య హీరో గా నటించిన ఈ చిత్రం రీసెంట్ గానే విడుదలై ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ , అసలు సూర్య కం బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అని ఆయన అభిమానులు బాధ పడుతున్న సమయం లో విడుదలైన ఈ చిత్రం , ట్రేడ్ పండితుల మైండ్ కూడా బ్లాస్ట్ అయ్యే రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకువెళ్తోంది. అయితే ఈ చిత్రాన్ని ముందుగా సూర్య తో చెయ్యాలని అనుకోలేదట.

ఆ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ముందుగా ఈ కథని వినిపించాడట. ఇది జరిగి రెండేళ్లు అయ్యింది. అంటే ‘పుష్ప’ సినిమా షూటింగ్ సమయం లో కథ వినిపించాడు అన్నమాట. అల్లు అర్జున్ కాన్సెప్ట్ , ఐడియా చాలా నచ్చింది కానీ , సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు సూచించాడట. ఈలోపు తెలుగు , తమిళ భాషల్లో సమీకరణాలు మారిపోయాయి. అల్లు అర్జున్ అట్లీ , లోకేష్ కనకరాజ్ వంటి డైరెక్టర్స్ తో పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం , ఆయన భవిష్యత్తు లైనప్ కూడా మారిపోవడం తో , ఈ ‘కరుప్పు’ చిత్రం ఆయన నుండి చేజారిపోయింది. ఆ తర్వాత స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి తమిళ హీరో సూర్య కి వినిపించడం , ఆయనకు ఈ కథ ఒక రేంజ్ లో నచ్చడం జరిగింది.

వెంటనే షూటింగ్ మొదలై పూర్తి చేసుకొని నేడు మన ముందుకొచ్చింది , ఇక ఆ తర్వాత జరిగింది మొత్తం హిస్టరీ. ఒకవేళ అల్లు అర్జున్ ఈ సినిమాని ఒప్పుకొని చేసుంటే ఎలా ఉండేది?, ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు అయ్యేవా?, ఆయన పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి, ఈ సినిమా దైవాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా కాబట్టి, నార్త్ ఇండియా లో కూడా క్లిక్ అయ్యి వెయ్యి కోట్లు రాబట్టి ఉండేదా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. అయితే వీరభద్రుడు గెటప్ లో సూర్య తర్వాత అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా సరిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు , చేసుంటే పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం అద్భుతాలను నెలకొల్పి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper