Homeటాప్ స్టోరీస్TANA Mothers Day Celebrations: ఛార్లెట్‌లో ఘనంగా తానా మదర్స్ డే వేడుకలు

TANA Mothers Day Celebrations: ఛార్లెట్‌లో ఘనంగా తానా మదర్స్ డే వేడుకలు

TANA Mothers Day Celebrations: అమెరికాలోని ఛార్లెట్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో మే 16న నిర్వహించిన మదర్స్ డే వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మందికిపైగా మహిళలు హాజరుకావడం విశేషం. తల్లులతో పాటు కూతుళ్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను ప్రత్యేకంగా నిలిపారు. ఛార్లెట్‌లో ఒకే కార్యక్రమానికి ఇంతమంది మహిళలు రావడం ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు.

ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు, వినోద కార్యక్రమాలు, విందు భోజనాలతో వేడుకలు సందడిగా జరిగాయి. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, జాయింట్ ట్రెజరర్ రాజేష్ యార్లగడ్డ, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని తదితరులు హాజరయ్యారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

తానా హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మాధురి ఏలూరి ప్రారంభం నుంచి కార్యక్రమ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టి, వచ్చిన వారందరూ ఆనందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

ఈ వేడుక విజయవంతానికి నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, రవి (నాని) వడ్లముడి తదితరులు కృషి చేశారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

వర్జీనియా నుంచి విచ్చేసిన ‘అందెలరవమిది’ ఫేమ్ ఇంద్రాణి దావలూరి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళల ప్రాముఖ్యతపై ప్రసంగించారు. సిన్సినాటి నుంచి వచ్చిన ప్రముఖ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అమ్మమ్మడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, గేమ్స్ నిర్వహిస్తూ సందడి చేశారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

యాంకర్ స్రవంతి ప్రత్తిపాటి తనదైన శైలిలో కార్యక్రమాన్ని చక్కగా నడిపించగా, సింగర్ స్నిగ్ధ ఎల్లేశ్వరపు ఆలపించిన మధుర గీతాలు ప్రేక్షకులను అలరించాయి.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations

కార్యక్రమ నిర్వహణలో సహకరించిన పద్మజ కొమ్మినేని, జ్యోత్స్న గంట, సౌమ్య శ్రీ తల్లాంకి, ఝాన్సీ అబ్బూరి, జ్యోత్స్న కాండ్లగుంట సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.

TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations
TANA Mothers Day Celebrations
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper