Homeఎంటర్టైన్మెంట్Husharu Pittalu: సినిమా పిచ్చోళ్ళ గురించి వినడమే కాదు లైవ్ లో చూడటం ఇదే ఫస్ట్...

Husharu Pittalu: సినిమా పిచ్చోళ్ళ గురించి వినడమే కాదు లైవ్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం..

Husharu Pittalu: ఈమధ్య కాలం లో కొంతమంది కొత్త నటీనటులు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడానికి చేస్తున్న కొన్ని స్తంట్స్ నెటిజెన్స్ కి ఇదేమి పిచ్చి రా బాబు అని అనిపించేలా చేస్తున్నాయి. అది వాళ్ళ నుండి బయటకు వచ్చిన నిజమైన ఎమోషనా ?, లేదంటే కావాలని సినిమాకు పబ్లిసిటీ కోసం చేస్తారా అనేది అర్థం అవ్వదు. ఒకవేళ నిజమైన ఎమోషనే అయ్యుండొచ్చు. కానీ అప్పటి వరకు బాగా ఉంటూ , కేవలం మైక్ […]

Husharu Pittalu: ఈమధ్య కాలం లో కొంతమంది కొత్త నటీనటులు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడానికి చేస్తున్న కొన్ని స్తంట్స్ నెటిజెన్స్ కి ఇదేమి పిచ్చి రా బాబు అని అనిపించేలా చేస్తున్నాయి. అది వాళ్ళ నుండి బయటకు వచ్చిన నిజమైన ఎమోషనా ?, లేదంటే కావాలని సినిమాకు పబ్లిసిటీ కోసం చేస్తారా అనేది అర్థం అవ్వదు. ఒకవేళ నిజమైన ఎమోషనే అయ్యుండొచ్చు. కానీ అప్పటి వరకు బాగా ఉంటూ , కేవలం మైక్ చేతుల్లోకి వచ్చినప్పుడు వింతగా ప్రవర్తించడం చూస్తే అధిక శాతం మంది జనాలకు అదొక పబ్లిసిటీ స్టంట్ లాగానే అనిపిస్తుంది. నిన్న జరిగిన ఒక సంఘటన అందుకు బెస్ట్ ఉదాహరణ అని చెప్పొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న హైదరాబాద్ లో ‘హుషారు పిట్టలు’ అనే మూవీ కి సంబంధించిన ఈవెంట్ జరిగింది.

ఇందులో ఒక భాను అనే నటుడు కీలక పాత్ర పోషించాడు. ఇతని చేతుల్లోకి మైక్ రాగానే , ఆరంభం లో మామూలుగానే మాట్లాడుతూ వచ్చాడు, కానీ అకస్మాత్తుగా చెంప పై పదే పదే కొట్టుకోవడం తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. సినిమాల్లో 8 ఏళ్ళ నుండి కష్టపడుతున్నాను అని , ఇన్నేళ్లకు నాకు ఈ సినిమా ద్వారా సరైన గుర్తింపు వచ్చిందని , ఇది కలో , నిజమో నమ్మలేకపోతున్నాను అని , అందుకే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు. ఇతను ఇలా చేయగానే వెనుక నిలబడినటువంటి హీరోయిన్ రియాక్షన్ ఒకసారి చూడండి. అసలు ఏమి జరుగుతుందో ఆమెకు అర్థం అవ్వలేదు పాపం. హీరో కూడా షాకింగ్ రియాక్షన్ పెట్టాడు , మిగిలిన వాళ్ళు కొంతమంది నవ్వుతున్నారు. ఏది ఏమైనా కానీ , ఆ నటుడు అనుకున్నది సాధించాడు. నిన్నటి నుండి సోషల్ మీడియా లో ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది.

అత్యధిక శాతం మంది నటులు ఇతన్ని తిడుతున్నారు. అలా తిట్టడం వల్ల , ఇతనితో పాటు , సినిమాకు కూడా బోలెడంత పబ్లిసిటీ వచ్చింది. అయితే ఈ నటుడు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇలా చేయడం వల్ల, సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందేమో కానీ , ఒక్కటంటే ఒక్క టిక్కెట్ కూడా అమ్ముడుపోదు. థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించడం అనేది సాధారణమైన విషయం కాదు. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ సినిమాలకే కంటెంట్ లేకుంటే థియేటర్స్ వైపు కూడా జనాలు చూడని రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో ఇటువంటి స్తంట్స్ కేవలం ఫ్రీ పబ్లిసిటీ ని మాత్రమే తెస్తుంది , కలెక్షన్స్ కాదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో అన్షు , వాసవి గణేషణ్ హీరో హీరోయిన్లు గా నటించారు. ఈ నెల 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper