Homeఎంటర్టైన్మెంట్Drama Juniors Season 9: అప్పుడే ముగిసిన 'డ్రామా జూనియర్స్ 9' ప్రోగ్రాం.. టైటిల్ విన్నర్...

Drama Juniors Season 9: అప్పుడే ముగిసిన ‘డ్రామా జూనియర్స్ 9’ ప్రోగ్రాం.. టైటిల్ విన్నర్ ఎవరంటే..

Drama Juniors Season 9: నిన్న గాక మొన్ననే మొదలైనట్టు అనిపిస్తున్న ‘డ్రామా జూనియర్స్ 9’ ప్రోగ్రాం అప్పుడే పూర్తి అయ్యింది. ఈ శని , ఆదివారాల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్స్ తో ఈ సీజన్ ముగియనుంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా , శ్రీకాంత్, అనిల్ రావిపూడి , రోజా జడ్జీలుగా వ్యవహరించిన ఈ షో ఇప్పటి వరకు ప్రసారమైన 8 సీజన్స్ కంటే చాలా చిన్నది అని చెప్పొచ్చు. మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నప్పటికీ కూడా […]

Drama Juniors Season 9: నిన్న గాక మొన్ననే మొదలైనట్టు అనిపిస్తున్న ‘డ్రామా జూనియర్స్ 9’ ప్రోగ్రాం అప్పుడే పూర్తి అయ్యింది. ఈ శని , ఆదివారాల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్స్ తో ఈ సీజన్ ముగియనుంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా , శ్రీకాంత్, అనిల్ రావిపూడి , రోజా జడ్జీలుగా వ్యవహరించిన ఈ షో ఇప్పటి వరకు ప్రసారమైన 8 సీజన్స్ కంటే చాలా చిన్నది అని చెప్పొచ్చు. మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నప్పటికీ కూడా ఎందుకో ఈ సీజన్ ని తొందరగా ముగించేస్తున్నారు. కేవలం 26 ఎపిసోడ్స్ , 13 వారాలు మాత్రమే ఈ షో కొనసాగింది. ఇంత చిన్న సీజన్ ని ఎందుకు నిర్వహించారు?, షో బాగానే నడుస్తుంది కదా?, ప్రేక్షకులు మంచిగా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ ఎందుకు ఇంత తక్కువ సమయం లోనే ముగిస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రీసెంట్ గానే ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేశారు. దానికి సంబంధించి రెండు ప్రోమోలను కూడా విడుదల చేశారు. ఈ ప్రోమోలలో శ్రీకాంత్ సతీమణి ఊహా కనిపించింది. ఆమెతో సుడిగాలి సుధీర్ కాసేపు సరదాగా చేసిన చిట్ చాట్ , అందుకు శ్రీకాంత్ స్పందన హైలైట్ గా నిలిచాయి అనే చెప్పాలి. ఇక ప్రోమో చివర్లో కప్పు ని రెవీల్ చేయడం , గ్రాండ్ ఫినాలే అంటూ చెప్పడం ప్రేక్షకులకు పెద్ద షాక్. కచ్చితంగా ఈ షో ని ప్రేక్షకులు బాగా మిస్ అవుతారు , అందులో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ , అనిల్ రావిపూడి కలిసి చేసే కామెడీ పెద్ద హైలైట్. వీళ్లిద్దరి మధ్య ఉండే కామెడీ కెమిస్ట్రీ ముచ్చట వేసేలా ఉంటుంది. శ్రీకాంత్ కూడా వీళ్ళిద్దరితో కలిసి చేసిన కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది.

ఇకపోతే ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా ఆది దేవ్ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. పిల్లలందరూ చిచ్చర పిడుగులు లాగా చేశారు కానీ , టైటిల్ ఎవరు గెలవబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆది దేవ్ కి మాత్రం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి అందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే. ఈ షో పూర్తి అవ్వగానే ఇదే ‘జీ తెలుగు’ లో ‘సరిగమప’ సరికొత్త సీజన్ మొదలు కానుంది. ఈ షో కి కూడా సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. అనిల్ రావిపూడి , అనంత శ్రీరామ్ , ఎస్పీ శైలజ జడ్జీలుగా వ్యవహరించనున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper