Homeఎంటర్టైన్మెంట్Rajamouli - Mahesh : దేశాన్ని ఊపేస్తున్న యానిమల్, సైలెంట్ గా రాజమౌళి, మహేష్... కారణం?

Rajamouli – Mahesh : దేశాన్ని ఊపేస్తున్న యానిమల్, సైలెంట్ గా రాజమౌళి, మహేష్… కారణం?

Rajamouli – Mahesh : యానిమల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేస్తున్న సినిమా. నేడు రోజుల్లో యానిమల్ వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన యానిమల్ భారీ లాభాలు పంచడం ఖాయంగా కనిపిస్తుంది. వీకెండ్ నాటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. యూఎస్ లో లాభాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా యానిమల్ బ్రేక్ ఈవెన్ టచ్ చేసినట్లు సమాచారం. దిల్ రాజు రూ. 15 కోట్లకు యానిమల్ హక్కులు సొంతం చేసుకున్నారు.

ఏపీ/తెలంగాణాలలో మూడు రోజులకు ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. యానిమల్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా కొందరు ఓపెన్ గానే పొగిడారు. బాలీవుడ్ క్రిటిక్స్, సెలెబ్స్ లో ఓ వర్గం రన్బీర్ నటన, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ పై ప్రశంసలు కురిపించారు. అనూహ్యంగా రాజమౌళి, మహేష్ బాబు యానిమల్ విషయంలో సైలెన్స్ పాటిస్తున్నారు. యానిమల్ విడుదలై నాలుగు రోజులు అవుతున్నా మహేష్, రాజమౌళి స్పందించలేదు.

నిజానికి వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. స్పోర్ట్స్, సినిమా, సోషల్ ఈవెంట్స్ పై తమ స్పందన తెలియజేస్తారు. అందులోనూ యానిమల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్, రాజమౌళి గెస్ట్స్ గా వెళ్లారు. ఈ ఈవెంట్ లో రాజమౌళి అయితే సందీప్ రెడ్డి వంగను ఆకాశానికి ఎత్తారు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అని గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు.

ఇక మహేష్ తాను రన్బీర్ కపూర్ అభిమానిని అన్నారు. తీరా సినిమా విడుదలయ్యాక తమ రివ్యూ ఇవ్వలేదు. ఈ క్రమంలో బాక్సాఫీస్ షేక్ చేస్తున్నప్పటికీ యానిమల్ మూవీ మహేష్, రాజమౌళిలకు నచ్చలేదా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే యానిమల్ మూవీలో వైలెన్స్, అడల్ట్ కంటెంట్ పరిమితికి మించి ఉంది. ఇలాంటి విషయాలను ప్రోత్సహించినట్లు ఉంటుంది. విమర్శలు రావచ్చని భయపడి సోషల్ మీడియాలో స్పందించకపోయి ఉండొచ్చని మరో వాదన వినిపిస్తుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...
Toxic Movie

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...
Nagarjuna

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Oktelugu Epaper