Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj : తీవ్ర వివాదంలో అనసూయ.. సంచలన వీడియో రిలీజ్..

Anasuya Bharadwaj : తీవ్ర వివాదంలో అనసూయ.. సంచలన వీడియో రిలీజ్..

Anasuya Bharadwaj : సమాజం లోని పలు అంశాలపై మాట్లాడేందుకు సినీ సెలబ్రిటీలు పెద్దగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే లేని పోని నెగెటివిటీ ని సంపాదించుకోవడం ఇష్టం లేక అలా చేస్తుంటారు. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం సమాజం లో జరిగే కొన్ని అంశాలపై నిర్మోహాటంగా, బోల్డ్ గా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాంటి సెలబ్రిటీలలో ఒకరు యాంకర్ అనసూయ. ఇలా మాట్లాడడం వల్ల, ఈమెపై సోషల్ మీడియా లో ఏ రేంజ్ నెగెటివిటీ ఏర్పడిందో […]

Anasuya Bharadwaj : సమాజం లోని పలు అంశాలపై మాట్లాడేందుకు సినీ సెలబ్రిటీలు పెద్దగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే లేని పోని నెగెటివిటీ ని సంపాదించుకోవడం ఇష్టం లేక అలా చేస్తుంటారు. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం సమాజం లో జరిగే కొన్ని అంశాలపై నిర్మోహాటంగా, బోల్డ్ గా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాంటి సెలబ్రిటీలలో ఒకరు యాంకర్ అనసూయ. ఇలా మాట్లాడడం వల్ల, ఈమెపై సోషల్ మీడియా లో ఏ రేంజ్ నెగెటివిటీ ఏర్పడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ నెగెటివిటీ ని తట్టుకోలేక ఈమె అనేక సార్లు పోలీసులను ఆశ్రయించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. రీసెంట్ గా ఆమె ‘జై శ్రీరామ్ ‘ అని నినాదాలు చేసే కొందరి ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈమె హిందువుల మనోభావాలు దెబ్బసింది అంటూ సోషల్ మీడియా లో కొందరు ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇంతకూ ఆమె చేసిన కామెంట్స్ ఏమిటంటే ‘జై శ్రీరామ్ అన్నంత మాత్రానా విలువలు పాటిస్తున్న మనుషులు అనుకోవడం పొరపాటు. వీళ్ళందరూ ముసుగు లో ఉన్నారు. వీళ్లంతా దాడి చేసేవారు’ అంటూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడం తో , ఆమె వెంటనే స్పందిస్తూ మరో వీడియో చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నేను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు. నేనొక హిందూ సనాతని. హనుమాన్ భక్తురాలిని. అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుణ్డా ఉండలేను, అది నా స్వభావం కాదు. నేను మాట్లాడిన సందర్భం గురించి వదిలేసి వాళ్లకు ఇష్టమొచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నన్ను ఇష్టపడే వాళ్లకు ఒక్కటే చెప్తున్నాను. దయచేసి ఎడిటెడ్ క్లిప్స్, హాఫ్ స్టేట్మెంట్స్ వలలో పడకండి’ అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ అనసూయ. అయితే అనసూయ క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా నెటిజెన్స్ నుండి సెగ తగ్గడం లేదు.

అయితే ఇది ఆమె ఎవరినో ఉద్దేశించి మాట్లాడినట్టు తెలుస్తోంది. అది ఎవరిని ఉద్దేశించి ఆమె ఈ కామెంట్స్ చేసింది అనేది మాత్రం తెలియడం లేదు. దీనిపై ఆమెనే క్లారిటీ ఇవ్వాలి. ఇకపోతే జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించినా అనసూయ , ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా , విలన్ గా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఒక్కప్పటి తో పోలిస్తే అనసూయ హవా ఈమధ్య కాలం లో కాస్త తగ్గిందనే చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by LIDIIA (@lidiyalv)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper