Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ షో చాలా పెద్ద హిట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ సీజన్ రెండవ వారం లో కానీ , లేదా 5 వ వారం లో కానీ పైకి లేస్తుంది , కానీ ఈ సీజన్ మాత్రం మొదటి వారం నుండే పైకి లేచింది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, టాస్కుల్లో ఓవర్ గా ఫిజికల్ అవ్వడం, నాగార్జున కోటింగ్ ఇవ్వడం , ఇలా ఒక్కటా రెండా , ఎన్నో సంఘటనలు ఈ సీజన్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా గత వారం ముగ్గురు కంటెస్టెంట్స్ కి నాగార్జున ఎల్లో కార్డు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ షో ని చూడని వాళ్ళు కూడా బిగ్ బాస్ లో జరిగిన ఈ సంఘటన గురించి చర్చించుకున్నారు.
ఇలా వారాలు గడిచే కొద్దీ టాస్కుల్లో ఇంటెన్సిటీ బాగా పెరిగిపోయింది. అందుకే టీవీ వ్యూయర్ షిప్ తో పాటు , హాట్ స్టార్ లో కూడా వ్యూస్ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. షో ప్రారంభం నుండి నేటి వరకు ఈ షో ని లైవ్ లో 8 కోట్ల 20 లక్షల మందికి పైగా వీక్షించారు. షో పూర్తి అయ్యే సమయానికి 15 నుండి 20 కోట్ల వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఈ రేంజ్ వ్యూస్ ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీ లో ఏ సీజన్ కి కూడా రాలేదని అంటున్నారు. తెలుగు తో పాటు హిందీ , తమిళం , కన్నడ, మలయాళం లో కూడా ఒకేసారి ఈ షో మొదలైంది. అన్ని బాషలకంటే మన తెలుగు లోనే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత ఈ సీజన్ రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ‘రోడ్ టు రీలోడ్’ పేరిట టాస్కులు నడుస్తున్నాయి. మొదటి టాస్క్ లో అపూర్వ , చరణ్ లు గెలవగా, రెండవ టాస్క్ లో అమన్ – త్రిగున్ లు గెలిచారు. మొదటి టాస్క్ లో చివరి స్థానం లో నిల్చిన షాలిని -రోహిత్ రెండవ టాస్క్ లో రెండవ స్థానం లో నిలిచారు. ప్రతీ టాస్క్ కి లీడర్ బోర్డు లో స్థానాలు మారిపోతున్నాయి. టాస్కులు మొత్తం పూర్తి అయ్యాక ఎవరైతే చివరి స్థానం లో నిలుస్తారో , వాళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే చరణ్ , అపూర్వ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు వరుసగా రెండు టాస్కులు ఓడిపోయారట. ఏది ఏమైనా ఈ వారం ఎలిమినేషన్స్ చాలా షాకింగ్ గా ఉండబోతోంది.