spot_img
Homeఎంటర్టైన్మెంట్Game Changer Collections : 3వ రోజు కూడా అదే జోరు..'డాకు మహారాజ్' మొదటి రోజు...

Game Changer Collections : 3వ రోజు కూడా అదే జోరు..’డాకు మహారాజ్’ మొదటి రోజు టికెట్ సేల్స్ ని మించిన ‘గేమ్ చేంజర్’ టికెట్ సేల్స్!

Game Changer Collections :  సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఈమధ్య కాలం లో చిన్న హీరో , పెద్ద హీరో అని తేడా లేదు. ఎవరికైనా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు వస్తున్నాయి. కానీ ఫ్లాప్ టాక్ తో కూడా భారీ వసూళ్లను రాబట్టే వాడే నిజమైన సూపర్ స్టార్. ఈ విషయం లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని మెచ్చుకోకుండా ఉండలేము. ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. విడుదల రోజు అభిమానులు ఉదయం నిద్ర లేచే లోపే అన్ని వెబ్ సైట్స్ లోనూ రేటింగ్స్ దారుణంగా వచ్చేసాయి. అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఆరేళ్ళ తర్వాత వస్తున్న రామ్ చరణ్ సినిమా, మూడేళ్లు ఈ చిత్రం కోసం కష్టపడ్డాడు. అలాంటి సినిమాకి ఇంత నెగటివ్ టాక్ వస్తే ఎంత బాధ వేస్తుంది?..

అయితే హీరో బాక్స్ ఆఫీస్ స్టామినా ఒక రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాకి రెండవ రోజు బుక్ మై షో యాప్ లో ఏకంగా నాలుగు లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. గత సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి రెండవ రోజు కేవలం లక్ష 40 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఆ సినిమాకి రెండు రెట్లు ఎక్కువ రాబట్టింది ‘గేమ్ చేంజర్’ చిత్రం. దీనిని బట్టి రామ్ చరణ్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నేడు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 19 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.

కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మూడవ రోజు ఏకంగా గంటకి 19 వేల 500 టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ మరియు నైజాం ప్రాంతం తప్ప, ఆంధ్రలో ఈ సినిమాకి మంచి వసూళ్లే వస్తున్నాయి. అదే విధంగా బాలీవుడ్ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే బుక్ మై షో యాప్ లో ఆ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఊపు చూస్తుంటే సంక్రాంతికి ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండవ రోజు ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నైజాం తో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వసూళ్లు బాగా పడిపోయాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాలయ్య సినిమాకంటే గేమ్ చేంజర్ కి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...
Oktelugu Epaper