Homeఎంటర్టైన్మెంట్Senior NTR Sons And Daughters: ఎన్టీఆర్ గారి సంతానంలో ఎంతమంది స్వర్గస్థులయ్యారో...

Senior NTR Sons And Daughters: ఎన్టీఆర్ గారి సంతానంలో ఎంతమంది స్వర్గస్థులయ్యారో తెలుసా ?

Senior NTR Sons And Daughters: దివంగత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ రామారావు నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్నగారి కుటుంబంలో ఇంతటి తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో అభిమానులు సైతం తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎన్టీఆర్ సంతానంలో ఇప్పటి వరకు ఎంత మంది కన్నుమూసారనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది.

Senior NTR Sons And Daughters
Senior NTR Sons And Daughters

నాలుగేళ్ల క్రితం హరికృష్ణ కారు యాక్సిడెంట్‌లో కన్నుమూశారు. అంతకు ముందు జానకి రామ్ కూడా యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఇప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. అందుకే, అసలు ఎన్టీఆర్ సంతానంలో ఎంత మంది స్వర్గస్తులయ్యారు అని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు.

మహానటుడు, మహా నేత ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ చాలా చిన్న వయసులోనే అరుదైన వ్యాధి వచ్చి చనిపోయారు. రామకృష్ణ మరణాన్ని జీర్ణించుకోవడానికి ఎన్టీఆర్ గారికి చాలా ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత పుట్టిన కుమారుడికి ఎన్టీఆర్ గారు రామకృష్ణ జూనియర్ అని పేరు పెట్టుకున్నారు.

Senior NTR Sons And Daughters
Harikrishna

ఇక కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ ఐదో కుమారుడు సాయి కృష్ణ అనారోగ్యంతో చనిపోయారు. సాయి కృష్ణ అంటే ఎన్టీఆర్ గారికి అమితమైన ఇష్టం. సాయి కృష్ణ కూడా ఎన్టీఆర్‌కు సంబంధించిన పర్సనల్ విషయాలన్నీ చూసుకునేవారు.

ఆ తర్వాత నందమూరి హరికృష్ణ గారు చనిపోయారు. ఎన్టీఆర్ గారితో ఒక్క హరికృష్ణ గారు మాత్రమే చాలా దైర్యంగా మాట్లాడేవారట. సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ హరికృష్ణ గారు తనదైన ముద్రను వేశారు. 2018 ఆగష్టు 29న రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ గారు చనిపోయారు.

నేడు ఎన్టీఆర్ నాలుగో కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేడుకుని చనిపోయారు. ఎన్టీఆర్‌ గారికి మొత్తం 12 సంతానం. వీరిలో 8 మంది మగ పిల్లలు.. 4 ఆడ పిల్లలు. ఇందులో ముగ్గురు కుమారులైన రామకృష్ణ, సాయికృష్ణ, హరి కృష్ణ స్వర్గస్తులయ్యారు.

Harikrishna
NTR, Hari Krishna, Uma Maheshwarari

ఇందులో రామకృష్ణ.. ఎన్టీఆర్ బతికి ఉండగానే కన్నుమూసారు. మిగతా ఇద్దరు తర్వాత స్వర్గస్తులయ్యారు. తాజాగా కంఠమనేని ఉమా మహేశ్వరి కలిపి మొత్తం నలుగురు సంతానం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సంతానంలో 5 గురు కుమారులు, 3 ముగ్గురు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. నందమూరి కుటుంబంలోనే హరికృష్ణకు కూడా పుత్రశోకం తప్పలేదు. ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో కన్ను మూసాడు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper