Homeఎంటర్టైన్మెంట్Drishyam 3 Worldwide Collections: 'దృశ్యం 3' 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఫ్లాప్...

Drishyam 3 Worldwide Collections: ‘దృశ్యం 3’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఫ్లాప్ టాక్ తో ఈ రేంజ్ గ్రాస్ అసలు ఊహించలేదు..

Drishyam 3 Worldwide Collections: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఒక సెన్సేషన్ ‘దృశ్యం’. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా తెరకెక్కిన ఈ సినిమా , అందుకు సంబంధించిన సీక్వెల్ ని ప్రతీ భాషలోనూ రీమేక్ చేశారు. మొదటి రెండు భాగాలకు సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో , మూడవ భాగాన్ని కూడా రీసెంట్ గానే తెరకెక్కించి విడుదల చేశారు. కానీ ‘దృశ్యం 3’ కి ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. […]

Drishyam 3 Worldwide Collections: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఒక సెన్సేషన్ ‘దృశ్యం’. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా తెరకెక్కిన ఈ సినిమా , అందుకు సంబంధించిన సీక్వెల్ ని ప్రతీ భాషలోనూ రీమేక్ చేశారు. మొదటి రెండు భాగాలకు సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో , మూడవ భాగాన్ని కూడా రీసెంట్ గానే తెరకెక్కించి విడుదల చేశారు. కానీ ‘దృశ్యం 3’ కి ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. మొదటి రెండు భాగాల్లో ఉన్న ట్విస్టులు , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ‘దృశ్యం 3’ లో బాగా మిస్ అయ్యాయి అని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. ఆ కారణం చేత ఈ చిత్రానికి అనుకున్నంత స్థాయి ఓపెనింగ్ రాలేదు , కానీ వీకెండ్ మాత్రం చాలా డీసెంట్ రేంజ్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఊహించిన దానికంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రాన్ని విడుదలకు ముందు 3 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేశారు మేకర్స్. మొదటి నాలుగు రోజులకు కలిపి 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 5 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లు వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది. అది పెద్ద కష్టమేమి కాదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే , కేరళ నుండి 39 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తమిళనాడు నుండి 5 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 13 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి 77 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా మొదటి 4 రోజులకు కలిపి ఈ చిత్రానికి 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 63 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని చాలా తక్కువకు చేయడం బాగా ప్లస్ అయ్యింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 30 కోట్ల రూపాయలకు జరగ్గా , లాభాలు 33 కోట్ల రూపాయిల వరకు వచ్చాయి. డివైడ్ టాక్ వచ్చిన ఒక సినిమాకు ఈ రేంజ్ లాభాలు రావడం చరిత్రలో ఇదే తొలిసారి , రాబోయే రోజుల్లో ఇంకా ఎంత లాభాలు వస్తాయో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper