spot_img
Homeఎంటర్టైన్మెంట్ఆ సీరియల్ హీరో దారుణంగా ఏడిపిస్తాడట !

ఆ సీరియల్ హీరో దారుణంగా ఏడిపిస్తాడట !

Doctor Babu
కరోనా పుణ్యమా అని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో పాటు సీరియల్స్ కూడా బాగానే క్లిక్ అయ్యాయి. వాటిల్లో కార్తీకదీపం అనే సీరియల్ ఒకటి. ఈ సీరియల్ గురించి, అందులోని పాత్రల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవ్వరూ ఉండరట. అంతగా ఈ సీరియల్ కి టీఆర్పీ రేటింగ్ వస్తోంది. పైగా కార్తీకదీపంలో సీరియల్‌లోని అన్ని పాత్రలు ఓ రేంజ్‌లో క్లిక్కయ్యాయి. మరీ ముఖ్యంగా కార్తీక్ ‘డాక్టర్ బాబు’గా నిరుపమ్.. వంటలక్క దీపగా ప్రేమీ విశ్వనాథ్‌లకు తిరుగులేని క్రేజ్ ను తెచ్చిపెట్టింది ఈ సీరియల్. వీరి పాత్రలు తరువాత హిమ, శౌర్య పాత్రలకు కూడా మంచి పేరు వచ్చింది.

Also Read: ఎట్టకేలకు కియారా కోరిక తీరబోతుంది !

ఆ క్యారెక్టర్స్ పోషిస్తోన్న బాల నటులు కృతిక, సహృదలకు కూడా ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. దీనికితోడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌లు సోషల్ మీడియాలో చేసే రచ్చ కూడా మామూలుగా ఉండదు. శౌర్య ఫేమ్ కృతిక.. తెరపై గంభీరంగా కనిపిస్తుంది.. కానీ రియల్ లైఫ్‌లో సాఫ్ట్‌గా కనిపిస్తూ.. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక హిమ పాత్రలో సహ‌ృద తెరపై చాలా అమాయకంగా కనిపిస్తుంది. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం ఈ పాప తెగ హుషారు పిల్ల. ఈ పాప వేసే డ్యాన్సులు చేసే అల్లరి మామూలుగా ఉండవు. అందుకే షూటింగ్ గ్యాప్‌లో డాక్టర్ బాబు హిమను దారుణంగా ఏడిపిస్తాడట.

Also Read: పెళ్లికి రెడీ అంటున్నా.. బుల్లితెర రాములమ్మ

కాగా నిరుపమ్ తెర వెనుకలా ఎంత సరదాగా ఉంటాడో తాజాగా చెప్పుకొచ్చింది. సీరియల్ యాక్టర్ ప్రభాకర్ భార్య మలయజ ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించి.. ఇంటర్వ్యూలు చేస్తోంది. ఈ క్రమంలో నిరుపమ్, సహృదలను కూడా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో సహృద ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. మొదటగా నిరుపమ్‌ను అన్నయ్య అని పిలిచేదట. కానీ ఆ తరువాత అంకుల్ అని పిలవాలని అనిపించిందని.. అందుకే అలాగే పిలుస్తున్నానని చెప్పింది. ఇక షూటింగ్ గ్యాప్‌లో తనను బాగా ఏడిపిస్తాడని, కోతి అంటూ పిలుస్తాడని నిరుపమ్ గురించి సహృద కంప్లైంట్ చేసింది. మరి డాక్టర్ బాబు ఇక నుండైనా ఏడిపించకుండా ఉంటాడేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Oktelugu Epaper