spot_img
Homeఎంటర్టైన్మెంట్Sreeleela: 'పుష్ప 2' లో ఐటమ్ సాంగ్ కోసం శ్రీలీల తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇంతనా..హీరోయిన్ గా...

Sreeleela: ‘పుష్ప 2’ లో ఐటమ్ సాంగ్ కోసం శ్రీలీల తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇంతనా..హీరోయిన్ గా కూడా ఇంత తీసుకోలేదుగా!

Sreeleela: ఇండస్ట్రీ లోకి వచ్చిన ఏడాది లోపే స్టార్ హీరోయిన్ అయ్యే అదృష్టం కోటి మందిలో ఒకరిద్దరికి మాత్రమే దక్కుతుంది. ఆ ఒకరిద్దరిలో ఒకరు శ్రీలీల. పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ అచ్చ తెలుగు అమ్మాయి, ‘ధమాకా’ చిత్రంతో ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయింది. చేతినిండా సినిమాలతో క్షణ కాలం తీరిక లేకుండా గడిపింది. అయితే స్క్రిప్ట్ సెలక్షన్ సరిగా లేకపోవడం ఈమెకు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ‘ధమాకా’ చిత్రం తర్వాత ఈమె అరడజనుకి పైగా సినిమాలు చేస్తే అందులో కేవలం ‘భగవంత్ కేసరి’ మాత్రమే హిట్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే శ్రీలీలే అనేక ఇంటర్వ్యూస్ లో ఈమధ్య కాలం లో స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ లో నటిస్తున్నారు, మీరు కూడా అవకాశం వస్తే చేస్తారా అని యాంకర్స్ అడిగిన ప్రశ్న కి సమాధానంగా ‘అసలు చేయను..నా ద్రుష్టి మొత్తం ఇప్పుడు సినిమాల మీదనే ఉంది’ అని చెప్పుకొచ్చేది.

అయితే ఈమధ్య ఆమెకి సినిమా అవకాశాలు తగ్గడం వల్లనో ఏమో తెలియదు కానీ ‘పుష్ప 2 : ది రూల్’ లో ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గత రెండు రోజుల నుండి జరుగుతుంది. ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయ్యాక మొదటి కాపీ ని సిద్ధం చేసి సెన్సార్ కి పంపనున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ ఐటెం సాంగ్ చేసేందుకు శ్రీలీల ఏకంగా నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిందట. ఒక్కో సినిమాలో హీరోయిన్ గా చేసేందుకు 3 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే శ్రీలీల ఇప్పుడు కేవలం నాలుగు నిమిషాల ఐటెం సాంగ్ కోసం నాలుగు కోట్ల రూపాయిలు డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. శ్రీలీల డ్యాన్స్ కి యూత్, మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. కేవలం ఆమె డ్యాన్స్ చూడడం కోసం థియేటర్స్ కి కదిలే ప్రేక్షకులు ఉంటారు.

అలాంటి అద్భుతమైన డ్యాన్సర్ కి అల్లు అర్జున్ లాంటోడు తోడైతే ఇండియా మొత్తం షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ పాట వల్ల అదనపు లాభం కలుగుతుంది కాబట్టే నిర్మాతలు కూడా శ్రీలీల ఎంత రెమ్యూనరేషన్ అడిగితే అంత ఇవ్వడానికి అంగీకరించారు. త్వరలోనే ఈ పాటకి సంబంధించిన లిరికాల్ వీడియో సాంగ్ రానుంది. సినిమా విడుదలకు వారం రోజుల ముందు ఈ పాటని విడుదల చేయనున్నారు మేకర్స్. డిసెంబర్ 5 న విడుదల అయ్యే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో మొదలైంది. విడుదలకు 25 రోజుల ముందే 6 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, కేవలం ప్రీమియర్ షోస్ నుండి రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను దాటుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper