spot_img
Homeఎంటర్టైన్మెంట్Director Karuna Kumar: గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో మూవీ స్టార్ట్ చేసిన ......

Director Karuna Kumar: గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో మూవీ స్టార్ట్ చేసిన … దర్శకుడు కరుణకుమార్

Director Karuna Kumar:  పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్‌ చిత్రాలతో కెరీర్‌ ఆరంభంలోనే మంచి ఐ‌టి లను సొంతం చేసుకున్నాడు దర్శకుడు  కరుణకుమార్‌. కాగా తాజాగా ఆయన డైరెక్షన్‌లో మరో చిత్రం పట్టాలెక్కనుంది. విభిన్న కథా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రియదర్శి, అంజలి, రావురమేశ్‌ కీలకపాత్రలు పోషించనున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు, విద్యామాధురి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

director karuna kumar started a new movie under geetha arts 2 banner

అయితే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు అల్లు అరవింద్‌, ఆయన పెద్ద కుమారుడు  బాబీ పాల్గొని టీమ్‌కి అభినందనలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం తెలిపింది. ఇటీవల కరుణ కుమార్ దర్శకత్వం వహించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుందని చెప్పాలి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించాడు. ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. కులాల మధ్య నలిగిపోయి విడిపోయే ప్రేమ కథతో ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కాగా ఈ చిత్రాన్ని  70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది.

మరోవైపు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఇటీవల నిర్మించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతూ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో అక్కినేని నాగార్జున నట వారసుడు అఖిల్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు  దర్శకుడుగా చేశారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper