‘యూవీ క్రియేషన్స్..’ ఈ పేరు చెప్పగానే బడా ప్రొడక్షన్ హౌస్ కళ్ల ముందు కదలాడుతుంది. ఆ సంస్థ చేసిన భారీ సినిమాలు గుర్తొస్తాయి. అయితే.. ప్రస్తుతం ఈ సంస్థ వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతోంది. ఈ బ్యానర్ అధినేతలు దాదాపు అరడజనులు సినిమాలకు ప్లాన్ చేయగా.. అందులో ఒక్కటి కూడా భారీ బడ్జెట్ సినిమా లేకపోవడం విచిత్రం.
Also Read: మూవీ రివ్యూః చావుకబురు చల్లగా
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ సాహోను నిర్మించింది యూవీ క్రియేషన్స్ వాళ్లే. ఇప్పుడు అదే ప్రభాస్ తో రాధేశ్యామ్ తీస్తున్నది కూడా వీళ్లే. అయితే.. ఈ సినిమా తర్వాత కొంతకాలం పాటు చిన్న సినిమాలు తీయడానికే సిద్ధమయ్యారు యూవీ నిర్మాతలు.
గోపీచంద్ – మారుతి కాంబోలో గీతాఆర్ట్స్-2తో కలిసి ‘పక్కా కమర్షియల్’ అనే సినిమా తీయబోతున్నారు. ఇది మీడియం రేంజ్ బడ్జెట్ మూవీ. మరోవైపు స్వీటీ అనుష్క – యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కాంబినేషన్లో కూడా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రమే.
Also Read: మూవీ రివ్యూః శశి
ఈ రెండింటి తర్వాత.. నితిన్ తో ఒక సినిమా, సిద్ధార్థ్ కార్తికేయ-2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇవి కూడా ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలే. త్వరలోనే అనౌన్స్ కాబోతున్న ‘ఏక్ మినీ కథ’ అనే సినిమా పేరుకు తగ్గట్టుగా లో బడ్జెట్ మూవీ. సంతోష్ శోభన్ ఇందులో హీరోగా కనిపించబోతున్నాడు.
ఈ విధంగా హై బడ్జెట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, లో-బడ్జెట్ సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు యువి అధినేతలు. గీతా ఆర్ట్స్-2తో కలిసి చిన్న సినిమాలు నిర్మిస్తామని ఆ మధ్య ప్రకటించారు. కొత్త టాలెంట్ సెర్చ్ లో భాగంగా ఇలా చేస్తున్నామని చెప్పారు. మరి, ఇదంతా అందులో భాగమేనా అన్నది సందేహం.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Uv creations geetha arts didnt do huge budget big movies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com