Ram Charan: మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన చాలా వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా త్వరలోనే రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో నుంచి చెర్రీ బర్త్ డే సందర్భంగా ఓ పాటను విడుదల చేశారు. తమన్ స్వరపరిచిన ఈ పాటను దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ లు పాడారు. ఇక కొరియోగ్రఫీ ప్రభుదేవా అందించారు. అనంత శ్రీరామ్ ఈ పాటను రచించారు.
అయితే ఆ పాట మాత్రం చాలా కలర్ ఫుల్ గా ఉంది. పాట విడుదల అవగానే రామ్ చరణ్ అభిమానులు చాలా సంతోషించారు. అయితే ఓ చిన్న మిస్టేక్ ను కూడా చేశారు మేకర్స్. ఇంతకీ అదేంటంటే.. సాంగ్ లో రియల్ లొకేషన్ కు సంబంధించిన ఓ సెట్ వేసి చిత్రీకరించారు. అందులో రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ కూడా కనిపిస్తుంది. వీళ్లిద్దరి గెటప్స్ పాటలో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మరి దర్శకుడు శంకర్ సినిమాలో పాటలు అంటే ఆ మాత్రం ఆకర్షణ ఉండాల్సిందే.
పాటలో సెట్టింగ్స్, లొకేషన్స్, హీరోహీరోయిన్స్ వేసుకునే బట్టలు అన్నీ కూడా చాలా కొత్త లుక్ తో కనిపిస్తుంటాయి. ఒక సందర్భంలో చెర్రీ వేసుకున్న కాస్ట్యూమ్ మీద కియారా అద్వానీ ఫోటోలు కూడా ఉంటాయి. ఇలాంటి ఐడియాలు శంకర్ కు తప్ప మరెవరికి రావనే చెప్పాలి. అయితే ఈ పాటను చాలా సార్లు చేద్దాం అనుకుని వాయిదా వేస్తూ వస్తున్నారట. మొత్తం మీద రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలోని సర్పైజ్ అనే పదాన్ని మిస్టేక్ గా రాశారు
surprise అని రాయాలా supprise అని రాశారు. మరి దీన్ని కావాలని రాశారో లేదా అనుకోకుండా జరిగిందో తెలియదు. కొన్ని సార్లు కావాలనే ఇలాంటి మిస్టేక్స్ కూడా చేస్తుంటారు మేకర్స్. అయితే మీరు ఒయ్ సినిమా చూసే ఉంటారు. అందులో oy అని రాసి ఉంటుంది. దీని చూసిన ప్రతి ఒక్కరు అదొక పలకరింపు అని అనుకుంటారు. కానీ వన్ ఇయర్ అని దానికి అర్థం చెప్పారు డైరెక్టర్. ఇలా కొన్ని సార్లు వాటికి సంబంధించిన మీనింగ్స్ తెలిసే సరికి ఆలస్యం కూడా అవచ్చు.