spot_img
Homeఎంటర్టైన్మెంట్చుక్కలు చూపించిన వెంకీ, వరుణ్ లపై దిల్ రాజు అలా పగతీర్చుకున్నాడా?

చుక్కలు చూపించిన వెంకీ, వరుణ్ లపై దిల్ రాజు అలా పగతీర్చుకున్నాడా?

F3 Movie Update

2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఎఫ్ 2. విక్టరీ వెంకటేష్, వరుణ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ నిర్మాత దిల్ రాజుకు కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ 3 ఉంటుందని చాలా కాలం క్రితమే అనిల్ రావిపూడి ప్రకటించడం జరిగింది. నిన్న వెంకటేష్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.

Also Read: చైతు ‘లవ్ స్టోరీ’లో కుల సమస్య !

డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. ఎఫ్ 2లో పెళ్ళైన మగాళ్లు పెళ్ళాల వలన పడే ఇబ్బందులను కామెడీగా చూపించిన అనిల్ రావిపూడి… ఈసారి డబ్బులు కాన్సెప్ట్ ని కామెడీ కోసం ఎంచుకున్నారు. సరిలేరు నీకెవ్వరు విడుదల తర్వాత… ఎఫ్ 3 స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి తన రైటింగ్ టీమ్ తో సొంత ఊరు వెళ్ళాడు అనిల్. లాక్ డౌన్ మొత్తం ఆయన అక్కడే గడిపారు.

Also Read: నారప్పగా వెంకీ అదరగొట్టాడు !

ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా నిర్మాత దిల్ రాజు వెంకీ, వరుణ్ లపై కూడా సెటైర్ వేశారని టాలీవుడ్ టాక్. సీక్వెల్ కావడంతో దర్శకుడు వెంకీ, వరుణ్ లనే మరలా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. దీనిని అవకాశంగా తీసుకొని రెమ్యూనరేషన్ విషయంలో దిల్ రాజుకు చుక్కలు చూపించారట. వెంకటేష్ రూ. 12 కోట్ల వరకు అందుకుంటుండగా… వరుణ్ పట్టుబట్టి రూ. 8 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడట. ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ లో ట్రాలీలలో డబ్బులు తీసుకెళుతున్న వరుణ్, వెంకీలను చూపించి… ఈ చిత్రం ద్వారా గట్టిగా రాబట్టారని దిల్ రాజు సెటైర్ వేశాడని అందరూ అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper