Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Telugu Version Openings: 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.....

Dhurandhar 2 Telugu Version Openings: ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. C సెంటర్స్ లో కూడా టికెట్ ముక్క లేదు!

Dhurandhar 2 Telugu Version Openings: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ధురంధర్’ మూవీ గురించే చర్చ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు ఇప్పుడు హిస్టరీ లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ అంటే, కచ్చితంగా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంతా ఊహించారు. కానీ ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ […]

Dhurandhar 2 Telugu Version Openings: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ధురంధర్’ మూవీ గురించే చర్చ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు ఇప్పుడు హిస్టరీ లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ అంటే, కచ్చితంగా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంతా ఊహించారు. కానీ ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ ని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. కేవలం రెండు రోజుల్లోనే ఓవర్సీస్ లో 10 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సునామీ ఎలాంటిది అనేది. ఓవర్సీస్, నార్త్ ఇండియా పక్కన పెడితే , తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం సెన్సేషనల్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తోంది.

Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు?

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తాయని అంతా ఊహించారు కానీ, ఈ రేంజ్ వసూళ్లు వస్తాయని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యింది. దీనికి సునామీ లాంటి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్ బోర్డులే కనిపించాయి. చిన్న చిన్న సెంటర్స్ లో కూడా టికెట్స్ కోసం క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడుతున్నారు ఆడియన్స్. పక్కనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమా ఉంది, అయినప్పటికీ కూడా మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమా వైపే నేడు మొగ్గు చూపించారు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు వెర్షన్ నుండి 10 కోట్ల రూపాయిల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇది చాలా అంటే చాలా ఎక్కువ అనే చెప్పాలి. హైదరాబాద్ వంటి సిటీస్ లో తెలుగు వెర్షన్ కి అత్యదిక షోస్ కేటాయించలేకపోయారు, హిందీ వెర్షన్ కి ఎక్కువ కేటాయించారు. ఒకవేళ తెలుగు వెర్షన్ కి షోస్ కేటాయించి ఉండుంటే కచ్చితంగా ఈ చిత్రం 20 కోట్ల గ్రాస్ మార్కుని కూడా అందుకొని ఉండేదని అంటున్నారు మేకర్స్. కానీ రాబోయే రోజుల్లో తెలుగు వెర్షన్ నుండి ఈ చిత్రం కచ్చితంగా 50 కోట్ల గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper