Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Buyers Shortage: తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2 ' కి బయ్యర్స్ కరువు.....

Dhurandhar 2 Buyers Shortage: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!

Dhurandhar 2 Buyers Shortage: ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రానికి అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ అయితే ఈ సినిమా కోసం మెంటలెక్కిపోయి ఉన్నారు. అయితే మూవీ టీం నుండి ఎలాంటి సౌండ్ రావడం లేదు, అసలు ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనే సందేహం ప్రతీ ఒక్కరిలోనూ ఉండేది. అలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ రేపు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయబోతున్నామని , సినిమా మార్చి 19 న రాబోతుందని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఓవర్సీస్ లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఆరంభం ట్రెండ్ ని చూస్తుంటే ee సినిమా ప్రీమియర్ షోస్ నుండే ప్రభంజనం సృష్టించేలా అనిపిస్తోంది. నార్త్ అమెరికా లో అప్పుడే ఈ చిత్రం 3 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లను దాటేసింది.

Also Read: ఇరాన్ ఉచ్చులో చిక్కుకున్న అమెరికా.. మునిగిపోక తప్పదా?

ఇది సాధారణమైన విషయం కాదు. చాలా మంది తెలుగు స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవ్వలేదు. రేపు నార్త్ అమెరికా లో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి. ఈ సినిమాకు కూడా ఈ రేంజ్ బుకింగ్స్ జరుగుతాయా అంటే అనుమానమే. ట్రైలర్ రాకముందే ఈ రేంజ్ అంటే , ఇక ట్రైలర్ వచ్చిన తర్వాత ఏ రేంజ్ బుకింగ్స్ ఉంటాయో మీరే ఊహించుకోండి. అంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్స్ లేరంటే నమ్ముతారా ?, కానీ నిజంగానే లేదు. మన తెలుగు ఆడియన్స్ లో కూడా ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ బయ్యర్స్ ఎందుకు లేరు అంటే, ఆ చిత్ర నిర్మాతలు రైట్స్ అమ్మడానికి సిద్ధంగా లేరని అర్థం.

మన టాలీవుడ్ టాప్ నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నుండి నవీన్ , రవిప్రకాష్, గీతా ఆర్ట్స్ నుండి అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ కోసం పెద్ద యుద్ధమే చేశారు. కానీ ఎవ్వరికీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. జియో సినిమాస్ సంస్థ నే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతుంది అట. బయ్యర్స్ ద్వారా విడుదల చేస్తే కమీషన్ రూపం లో సగానికి పైగా వాళ్ళకే పోతుందని, అదే మన సొంతం గా విడుదల చేసుంటే మొత్తం మనకే మిగులుతుందని నిర్మాతల అభిప్రాయం. కేవలం మల్టీప్లెక్స్ థియేటర్స్ లో విడుదల చేసుకున్న చాలు, మా వ్యాపారం సేఫ్ అన్నట్టుగా ఉన్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular