Dhee Raju: ‘ఢీ ‘డ్యాన్స్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న డ్యాన్సర్స్ లో ఒకడు రాజు. ఈయన గత సీజన్ టైటిల్ విన్నర్ గా కూడా నిలిచాడు. ఢీ స్టేజి మీద రాజు తో తలపడి గెలవడమంటే సాధారణమైన విషయం కాదు , చాలా కష్టం అనే రేంజ్ బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తుంది అని అనుకుంటున్న సమయం లో, ఆయన్ని రీసెంట్ గా పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పెద్ద సంచలనానికి దారి తీసింది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి , తనను లైంగికంగా వాడుకొని వదిలేశాడని ఒక యువతి రాజు పై కేసు నమోదు చేయగా , పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ లోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆ యువతి FIR లో పేర్కొన్న కొన్ని విషయాలను చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ షాక్ కి గురి అవుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే రాజు వయస్సు పాతికేళ్ళు కాగా , బాధితురాలి వయస్సు 35 ఏళ్ళు. ఈమె ఉంటున్న అపార్ట్మెంట్స్ లో చిట్టి మాస్టర్ డ్యాన్స్ స్టూడియో ఉంటుందట. అక్కడకి రాజు వచ్చి ప్రాక్టీస్ చేస్తుండడం , అలా ఆయనతో నెమ్మదిగా పరిచయం ఏర్పడి, కాలక్రమేణా అది ప్రేమ గా మారడం వంటివి జరిగాయట. ఈమెకు ఒక బొటిక్ షాప్ కూడా ఉందట. రిలేషన్ లో ఉన్నప్పుడు రాజు కి ఈమె అనేక సందర్భాల్లో విడతల వారీగా 12 లక్షల రూపాయిల వరకు డబ్బులు కూడా ఇచ్చిందట. అయితే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన రాజు ని , ఆ మాట గుర్తు చేయగా , నా చెల్లి పెళ్లి అయ్యేవరకు చేసుకోలేనని చెప్పాడని, అతనికి కావాల్సినంత సమయం ఇచ్చానని , ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఆర్థికంగా చాలా అప్పులు ఉన్నాయని , అవి తీరేంత వరకు పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు అంటూ ఆమె FIR లో పేర్కొన్నది.
ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజన్స్, రాజు అనవసరంగా కక్కుర్తి పడ్డాడు, తనకంటే పదేళ్లు పెద్ద అయినప్పటికీ కూడా, ఆమెతో రిలేషన్ పెట్టుకోవడం అతను చేసిన పెద్ద పొరపాటు. రిలేషన్ పెట్టుకున్నప్పటికీ , ఫైనాన్షియల్ గా ఆమె సహాయం తీసుకోవడం కూడా మరో పెద్ద పొరపాటు. ఈ రెండు అంశాల కారణంగా రాజు బంగారం లాంటి కెరీర్ ని నాశనం చేసుకున్నాడంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కేసు లో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకోబోతున్నాయి , రాజు కి బెయిల్ వస్తుందా లేదా?, ఈ అంశం లో తప్పు ఎవరిదీ అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.