Bigg Boss Telugu OTT: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తోన్న హాట్ రియాలిటీ గేమ్ షో బిగ్‌బాస్ సీజన్ 5 ఎట్టకేలకు ముగిసింది. ఎవరు గెలుస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులు సన్నీ విజయంతో రిలాక్స్ అయ్యారు. తెలుగుతో పాటు, ఇండియన్ టెలివిజన్ అన్ని ప్రధాన భాషల్లో ఈ షోకు మంచి క్రేజ్ ఉంది. కాగా, తెలుగులో సీజన్ 5 ముగిసిన నేపథ్యంలో.. నెక్స్ సీజన్ ఎప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆసక్తికరమైన ప్రకటనతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. తర్వాత వచ్చే సీజన్‌ను సరికొత్త వర్షన్‌తో ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఈ షో టీవీలో కాకుండా.. ఓటీటీ వర్షన్‌ను సిద్ధంచేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా, టీవీలో గంట, రెండు గంటలు కాకుండా.. మొత్తం 24 గంటలు ప్రసారం అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: షణ్ముఖ్, సిరి రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన సన్ని
ఓటీటీలో రానున్న ఈ వర్షన్‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ వర్షన్ డెవలప్ చేసే పనిలో ఉన్నారట. అలాగే నాగ్ ఎంట్రీ ఎప్పుడుంటుంది?.. ఈ షో ఎప్పటి నుంచి మొదలువుతుంది?.. ఈ సారి హౌస్మేట్స్ ఎవరన్న విషయాలన్ని త్వరలోనే ఒక్కొక్కటిగా రివీల్ చేస్తామని చెప్పారు. దీంతో బిగ్‌బాస్ ప్రేమికుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. టీవీలో ప్రసారమయ్యే కొద్దిసేపే ఎంతో ఆసక్తిగా ఉంటే.. ఇప్పుడు 24 గంటలంటే ఇంకెంత క్రేజీగా ఉంటుందో అని అంచనాలు వేసుకుంటున్నారు. మరి ఈ సరికొత్త ప్రయత్నం ఏ మేరకు హిట్ అవుతుందో తెలియాల్సి ఉంది.
Also Read: BigBoss: ప్రేమ పేరుతో మోసపోయిన ప్రముఖ బిగ్‌బాస్ నటి
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More